ఈ ఫోటోను తొలగించిన ఇన్‌స్టాగ్రామ్
అభ్యంతరకర చిత్రాలపై కఠిన నిబంధనలను అమలు చేస్తోంది ఇన్‌స్టాగ్రామ్. ఫోటోలు, వీడియోలతోపాటు ఫేక్ న్యూస్ పోస్ట్ చేసేవారిపై కూడా వేటు వేస్తోంది. తాజాగా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ముద్దు పెట్టుకున్న ఒక చిత్రాన్ని తొలిగించింది. ఆ మధ్య డాన్సర్న టి నటాషా స్టాంకోవిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ చిత్రం తమ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది అంటూ ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది. మంగళవారం నటాషా అదే చిత్రాన్ని స్కీన్‌షాట్ తీసి మళ్లీ పోస్ట్ చేసింది. […]

అభ్యంతరకర చిత్రాలపై కఠిన నిబంధనలను అమలు చేస్తోంది ఇన్‌స్టాగ్రామ్. ఫోటోలు, వీడియోలతోపాటు ఫేక్ న్యూస్ పోస్ట్ చేసేవారిపై కూడా వేటు వేస్తోంది. తాజాగా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ముద్దు పెట్టుకున్న ఒక చిత్రాన్ని తొలిగించింది. ఆ మధ్య డాన్సర్న టి నటాషా స్టాంకోవిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోను పోస్ట్ చేశారు.
ఈ చిత్రం తమ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది అంటూ ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది. మంగళవారం నటాషా అదే చిత్రాన్ని స్కీన్‌షాట్ తీసి మళ్లీ పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోను ఈసారి ఇన్‌స్టాగ్రామ్ తొలగించలేదు. ఈ చిత్రం చాలా చిన్న ఉండటం వల్లే తొలిగించక పోయి ఉండచ్చు.. ఇక మొదటిసారి షేర్ చేసిన చిత్రం స్థానంలో ఫోటో స్థానంలో ‘మీ చిత్రం ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీ మార్గదర్శకాలకు విరుద్దంగా ఉంది కాబట్టి మీ పోస్ట్‌ను తొలగించాల్సి వచ్చింది’ అనే మెసేజ్ కనిపిస్తోంది.




