ఇండిగో బంపర్ ఆఫర్.. 10 శాతం చెల్లించి టికెట్ పొందొచ్చు..

విమాన ప్రయాణీకులకు ఇండిగో సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. విమాన టికెట్ ధరలో 10 శాతం మాత్రమే చెల్లించి టికెట్ బుక్ చేసుకునే 'ప్లెక్స్ పే' స్కీమ్ ను ప్రవేశపెట్టింది. టికెట్ ధరలో మిగతా

  • Tv9 Telugu
  • Publish Date - 11:00 am, Fri, 26 June 20
ఇండిగో బంపర్ ఆఫర్.. 10 శాతం చెల్లించి టికెట్ పొందొచ్చు..

IndiGo Allows Passengers To Pay 10% Only: విమాన ప్రయాణీకులకు ఇండిగో సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. విమాన టికెట్ ధరలో 10 శాతం మాత్రమే చెల్లించి టికెట్ బుక్ చేసుకునే ‘ప్లెక్స్ పే’ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. టికెట్ ధరలో మిగతా 90 శాతాన్ని టికెట్ బుక్ చేసుకున్న 15 రోజుల్లోగా.. లేదంటే ప్రయాణ తేదికి 15 రోజులు ముందుగా చెల్లించవచ్చని తెలిపింది. ఒకవేళ టికెట్ బుక్ చేసుకున్నవారు 90 శాతం చెల్లించకున్నా, ప్రయాణం వద్దనుకున్నా 10 శాతం డబ్బు వాపస్ ఇవ్వబోమంది.

Also Read: జూలై 21 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర.. 15 రోజులకు కుదింపు..