AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయులకు బంపర్ ఆఫర్.. వీసా లేకుండా ఎన్ని దేశాలు చుట్టేయొచ్చంటే.?

విదేశాలకు టూర్ ప్లాన్ చేసే భారతీయులకు 58 దేశాలు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. వీసా సమస్య లేకుండానే తమ దేశాల్లో పర్యటించడానికి అనుమతులు ఇస్తున్నాయి. సాధారణంగా విదేశాలకు టూర్ కోసమైనా.. లేక చదువు కోసం వెళ్లాలన్నా వీసా తప్పనిసరిగా అవసరమవుతుంది. కొన్నిసార్లయితే వీసా సమస్యల వల్ల ప్రయాణాలు కూడా ఆగిపోతుంటాయి. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇండియన్ పాస్‌పోర్టు మరింత పటిష్టంగా మారడంతో చాలా దేశాలు భారతీయులకు వీసా లేకుండానే పర్యటించడానికి […]

భారతీయులకు బంపర్ ఆఫర్.. వీసా లేకుండా ఎన్ని దేశాలు చుట్టేయొచ్చంటే.?
Ravi Kiran
|

Updated on: Jan 13, 2020 | 3:12 PM

Share

విదేశాలకు టూర్ ప్లాన్ చేసే భారతీయులకు 58 దేశాలు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. వీసా సమస్య లేకుండానే తమ దేశాల్లో పర్యటించడానికి అనుమతులు ఇస్తున్నాయి. సాధారణంగా విదేశాలకు టూర్ కోసమైనా.. లేక చదువు కోసం వెళ్లాలన్నా వీసా తప్పనిసరిగా అవసరమవుతుంది. కొన్నిసార్లయితే వీసా సమస్యల వల్ల ప్రయాణాలు కూడా ఆగిపోతుంటాయి. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు ఇండియన్ పాస్‌పోర్టు మరింత పటిష్టంగా మారడంతో చాలా దేశాలు భారతీయులకు వీసా లేకుండానే పర్యటించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. హెన్లే పాస్ పోర్ట్ 2020 నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్స్ లిస్టులో మన భారత పాస్‌పోర్టు 84వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఈ జాబితాలో జపాన్ పాస్‌పోర్టు అగ్రస్థానంలో ఉండగా.. దానితో ఈజీగా 191 దేశాలను వీసా లేకుండా సందర్శించే అనుమతి ఉంది.

ఇక సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల పాస్ పోర్టులతో కూడా ప్రపంచంలోని దాదాపు 150 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్ చేయవచ్చు. ఈ లిస్టులో ఇండియా దక్షిణ ఆసియాలోనే టాప్ ర్యాంక్ దక్కించుకోగా.. మన పాస్‌పోర్టుతో 58 దేశాలు అదే విధంగా చుట్టేసేయొచ్చు. అంతేకాకుండా మలేషియా, యునైటెడ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో 15 రోజుల పాటు ప్రయాణించడానికి ఉచిత ఆన్‌లైన్ వీసా కూడా లభిస్తుంది.

Follow Us