వెస్టిండీస్‌తో తలపడనున్న భారత్

వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ప్రపంచకప్‌లో భాగంగా నేడు వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లన్నీ గెలిచి సెమీస్‌ దిశగా టీమిండియా అడుగులు వేస్తుంటే.. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడి నాకౌట్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది వెస్టిండీస్‌. టీమిండియాలో ఫామ్‌లో ఉన్న రోహిత్‌, విరాట్ కోహ్లీల నుంచి భారత్‌ భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. పాక్‌తో మ్యాచ్‌లో తడబడ్డ ప్రధాన పేసర్‌ బుమ్రా.. అఫ్గాన్‌పై తన బౌలింగ్‌ తో మరిపించాడు. ఆ మ్యాచ్‌లో షమి కూడా తన […]

వెస్టిండీస్‌తో తలపడనున్న భారత్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 27, 2019 | 6:56 PM

వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ప్రపంచకప్‌లో భాగంగా నేడు వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లన్నీ గెలిచి సెమీస్‌ దిశగా టీమిండియా అడుగులు వేస్తుంటే.. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడి నాకౌట్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది వెస్టిండీస్‌. టీమిండియాలో ఫామ్‌లో ఉన్న రోహిత్‌, విరాట్ కోహ్లీల నుంచి భారత్‌ భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. పాక్‌తో మ్యాచ్‌లో తడబడ్డ ప్రధాన పేసర్‌ బుమ్రా.. అఫ్గాన్‌పై తన బౌలింగ్‌ తో మరిపించాడు. ఆ మ్యాచ్‌లో షమి కూడా తన సత్తా చాటుకున్నాడు. స్పిన్నర్లు నిలకడగానే రాణిస్తున్నారు. కాగా పాకిస్థాన్‌తో భారత్‌ మ్యాచ్‌ ఆడిన ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ స్టేడియమే వెస్టిండీస్‌తో ఆటకు కూడా వేదికైంది.

ఇప్పటివరకూ టీమిండియా-వెస్టిండీస్ మొత్తంగా 126 మ్యాచ్‌లలో తలపడగా.. 59 మ్యాచ్‌ల్లో భారత్, 62 మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయాన్ని అందుకున్నాయి. 2 మ్యాచ్‌లు టై కాగా.. మూడు మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. ఇక వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 8 సార్లు తలపడగా.. 5 మ్యాచ్‌ల్లో టీమిండియా.. 3 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ గెలుపొందాయి.