పంత్ మారడు.. ధోనిని జట్టులోకి తీసుకోరు.. ఏం చెయ్యాలిరా సాంబ!

మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేయడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. అందులో భాగంగానే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అనేక ఛాన్స్‌లు ఇస్తూ వచ్చింది. అయితే వాటిని అందిపుచ్చుకోవడంలో రిషబ్ పంత్ పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టూర్‌లో […]

పంత్ మారడు.. ధోనిని జట్టులోకి తీసుకోరు.. ఏం చెయ్యాలిరా సాంబ!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 20, 2019 | 10:21 AM

మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేయడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. అందులో భాగంగానే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అనేక ఛాన్స్‌లు ఇస్తూ వచ్చింది.

అయితే వాటిని అందిపుచ్చుకోవడంలో రిషబ్ పంత్ పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టూర్‌లో గానీ.. రీసెంట్‌గా సఫారీలతో జరిగిన రెండో టీ20లో గానీ పంత్ పెద్దగా రాణించలేదు. ఎప్పుడూ ఒకే తరహా షాట్ ఆడుతూ ఔటవ్వడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అటు కోహ్లీ, ఇటు కోచ్ రవిశాస్త్రి ఇద్దరూ కూడా రిషబ్ పంత్ ఫెయిల్ అవుతున్నా ఎక్కువ ఛాన్స్‌లు ఇస్తుండటంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ క్రమంలో ‘తలా’ ధోనిని మళ్ళీ జట్టులోకి తిరిగి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విదేశీ పిచ్‌లపై పంత్ ప్లాప్ అవుతున్నా.. సొంతగడ్డపై రాణిస్తాడని అందరూ భావించారు. అయితే అది కూడా జరగకపోవడంతో ఇప్పటికైనా వేరే వికెట్ కీపర్లకు ఛాన్స్‌లు ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. మరోవైపు పంత్ షాట్ సెలక్షన్ మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని కోచ్ రవిశాస్త్రి కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..