India Vs Australia 2020: డే/నైట్ టెస్ట్: రన్ మెషిన్ విరాట్ కోహ్లీ దెబ్బకు 51 ఏళ్ల రికార్డు బద్దలు..

|

Dec 17, 2020 | 8:58 PM

టీమిండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు రికార్డులను బద్దలుకొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేసిన

India Vs Australia 2020: డే/నైట్ టెస్ట్: రన్ మెషిన్ విరాట్ కోహ్లీ దెబ్బకు 51 ఏళ్ల రికార్డు బద్దలు..
Follow us on

India Vs Australia 2020: టీమిండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు రికార్డులను బద్దలుకొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేసిన కోహ్లీ.. ఆస్ట్రేలియాలో ఎక్కువ రన్స్ చేసిన భారత సారధిగా అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే 51 ఏళ్ల క్రితం మన్సూర్ అలీఖాన్ 20 ఇన్నింగ్స్‌లో చేసిన 829 పరుగుల మార్క్‌ను.. విరాట్ కోహ్లీ కేవలం 17 ఇన్నింగ్స్‌లోనే అందుకున్నాడు. అటు ఆస్ట్రేలియాతో ఆ జట్టుపై అత్యధిక రన్స్ చేసిన ఆసియా క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. గతంలో సచిన్(2549 రన్స్) పేరిట ఉన్న ఈ రికార్డును తిరగరాశాడు.

కాగా, అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు నష్టానికి 233 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(74), ఛటేశ్వర్ పుజారా(42), అజింక్యా రహానే(42)లు రాణించారు. ప్రస్తుతం అశ్విన్(15), సాహా(9) క్రీజులో ఉన్నారు.

Also Read:

బిగ్ బాస్ 4 ఓటింగ్: అగ్రస్థానంలో అరియానా.. రెండో స్థానంలో అభిజిత్..!

పోలీసులను ఆశ్రయించిన మోనాల్ గజ్జర్.. అభిజిత్ ఫ్యాన్స్‌పై ఫిర్యాదు..

”మాయా స్తంభం పోయే.. రాక్షసుడి స్టాట్యూలు వచ్చే”.. వైరల్ ఫోటోలు..

ఏడుకొండలలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమా..?