India Vs Australia 2020: వార్మప్ మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో అదరగొట్టిన రిషబ్ పంత్.. మరి తుది జట్టులో చోటు దొరికేనా.?
రిషబ్ పంత్ తొలి వార్మప్ మ్యాచ్‌లో పేలవ ఆటతీరును కనబరిచినప్పటికీ.. రెండో దానిలో దూకుడైన విధ్వంసకర ఆటతో విజృంభించాడు. సాహాకు బదులుగా..
India Vs Australia 2020: ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌ల్లో టీమిండియా బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. తొలి టెస్టుకు ముందు భారత్ జట్టుకు ఇది శుభ పరిణామం. శుభ్‌మాన్ గిల్, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, అజింక్యా రహానే, రిషబ్ పంత్‌లు బ్యాట్‌తో అదరగొట్టారు. అందరూ తమ నిలకడైన ఆటతీరుతో తుది జట్టులో చోటు సంపాదించేందుకు శాయశక్తులా ప్రయత్నించారని చెప్పాలి.
ముఖ్యంగా రిషబ్ పంత్ తొలి వార్మప్ మ్యాచ్‌లో పేలవ ఆటతీరును కనబరిచినప్పటికీ.. రెండో దానిలో దూకుడైన విధ్వంసకర ఆటతో విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహాకు కంటే ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంత్.. 73 బంతుల్లో మెరుపు శతకాన్ని బాదాడు. దీనితో సాహాకు బదులుగా పంత్ తొలి టెస్టు మ్యాచ్‌కు తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే వార్మప్ మ్యాచ్‌లో కొట్టినంత మాత్రాన తొలి టెస్ట్‌కు పంత్ ఎంపిక కాలేడని కొంతమంది వాదన. టెస్టు మ్యాచ్‌ల్లో స్ట్రైక్ రొటేట్ చేయడం చాలా ముఖ్యమని.. అందులో సాహా ఆరితేరిన వాడని.. అతని గత రికార్డులే చెబుతున్నాయని అంటున్నారు. అలాగే అటు బ్యాట్స్‌మెన్‌గా, ఇటు వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
కాగా, ఆస్ట్రేలియా టూర్‌కు రిషబ్ పంత్‌ను కేవలం టెస్టు జట్టుకు మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అయితే కేఎల్ రాహుల్ ఫామ్ దృష్యా.. మరోవైపు వృద్ధిమాన్ సాహాకు టెస్టుల్లో ఉన్న రికార్డు చూసుకుంటే పంత్ టెస్టులు ఆడడం కష్టమే అని అంటున్నారు. ఆసీస్-ఏతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ ఇండియా-ఏ తరపున పంత్ స్థానంలో సాహాకు స్థానం లభించింది. రానున్న రోజుల్లో పంత్ టెస్టుల్లో కూడా తన స్థానాన్ని కోల్పోనున్నాడు.