ఆ సంస్థలో అన్ని కల్తీ సరుకులే విక్రయిస్తారు.. హెరిటేజ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన తెలుగు అకాడమీ చైర్మన్
ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి హెరిటేజ్ సంస్థను ఉద్ధేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి హెరిటేజ్ సంస్థను ఉద్ధేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ మొదట్లో నష్టాల్లో ఉండేదని అయితే మోహన్‌బాబుకు డైరెక్టర్ ఇస్తామని పెట్టుబడులు పెట్టించి తర్వాత బయటకు తోసారని ఆరోపించారు. హెరిటేజ్ పాపాలు అన్ని ఇన్ని కావని అందులో మొత్తం కల్తీ సరుకులే విక్రయిస్తారని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అవినీతి చేసి వేల కోట్ల సంపాదించి హెరిటేజ్‌లో పెట్టుబడులు పెట్టారని మండిపడ్డారు.హెరిటేజ్ కోసమే విజయ డెయిరీతో పాటు ఇతర డెయిరీలను నాశనం చేశారని వ్యాఖ్యానించారు. సంఘం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. అమూల్ చిన్నసంస్థ కాదని, పాడిపంటలను నమ్ముకున్న మహిళల అభివృద్ధి కోసమే అమూల్‌ను తీసుకొచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడని, జగన్ గెలిచిన దగ్గర నుంచి చంద్రబాబుకు అన్ని ఏడుపులే మిగిలాయని ఎగతాళి చేశారు.