AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: గమ్మునుండవోయ్.. టాస్‌కి ముందు రిఫరీకి దమ్కీ ఇచ్చిన సూర్య.. రోహిత్ కోసం అలా అనేశాడా?

Suryakumar Yadav Asked the Match Referee to Wait for Two Minutes Before the Toss: భారత్ వర్సెస్ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ రోహిత్ శర్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాంఖడేలో సందడి చేసిన రోహిత్ కోసం సూర్య ఏకంగా రిఫరీకే దమ్కీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.

Video: గమ్మునుండవోయ్.. టాస్‌కి ముందు రిఫరీకి దమ్కీ ఇచ్చిన సూర్య.. రోహిత్ కోసం అలా అనేశాడా?
Rohit Sharma Surya Kumar Video
Venkata Chari
|

Updated on: Feb 08, 2026 | 5:05 PM

Share

Suryakumar Yadav Rohit Sharma Toss Advice: మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే, టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో తనకు అలవాటైన అలవాట్లను ఏమాత్రం విడిచిపెట్టలేదు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ఓ వీడియోలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే, రోహిత్ శర్మ భావోద్వేగంతో ప్రేక్షకుల సీటులో కూర్చుని టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కనిపిండం గమనార్హం. భారత్ వర్సెస్ యూఎస్ఏ టీ20 వరల్డ్‌కప్ 2026 మ్యాచ్ తర్వాత ఐసీసీ ఈ వీడియోను విడుదల చేసిది.

టీమిండియా టీ20 వరల్డ్‌కప్ వారసత్వం..

2024లో భారత్ రెండోసారి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు రోహిత్ శర్మ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో ఉత్కంఠభరితమైన చివరి ఓవర్ థ్రిల్లర్‌లో టీమిండియా విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ విజయం కెప్టెన్‌కు కలలాంటిదే కాకుండా, మొత్తం భారత జట్టుకూ భావోద్వేగ క్షణాలను మిగిల్చింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ మైదానంలో భావోద్వేగంతో రిటైర్మెంట్ ప్రకటించిన ఆ క్షణాలను భారత క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు. కానీ, 2 ఏళ్ల తరువాత పరిస్థితులు మారాయి. రోహిత్ టీ20 ఫార్మాట్‌కు రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం 2026లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు.

భారత జట్టుతో రోహిత్ శర్మ చిలిపి చేష్టలు..

మ్యాచ్‌కు ముందు టాస్ గెలిస్తే ఏమి చేయాలో కూడా రోహిత్ శర్మ కెప్టెన్‌ సూర్యకు సలహా ఇస్తూ కనిపించాడు. తన ప్రత్యేక శైలిలో మళ్లీ మైదానంలోని కెప్టెన్ పాత్రలోకి వెళ్లినట్టుగా అనిపించింది. ఐసీసీ విడుదల చేసిన వీడియోలో రోహిత్ శర్మ అనేక భావోద్వేగాల మధ్య కనిపించాడు. టాస్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ రోహిత్‌ను కలసి,

“జల్దీ బోలో, బ్యాట్ లేదా బౌల్?” (టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలా లేక బౌలింగ్ ఎంచుకోవాలా?) అని అడిగాడు.

దానికి రోహిత్ వెంటనే, “ఫీల్డింగ్ తీసుకో, పిచ్చివాడివా?” అని సరదాగా సమాధానం ఇచ్చాడు.

అయితే, రోహిత్ సలహా అమలులోకి రాలేదు. ఎందుకంటే టాస్‌ను సూర్యకుమార్ యాదవ్ ఓడిపోవడంతో, వాంకడే స్టేడియంలో యూఎస్ఏ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.

మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్‌లను కలుసుకున్నాడు. అలాగే అక్షర్ పటేల్‌ను “అరేయ్ బాపూ..” అంటూ ఆప్యాయంగా పలకరించాడు.

రోహిత్ కోసం సూర్య షాకింగ్ డెసిషన్..

అయితే, టాస్ జరిగే ముందు రోహిత్ శర్మ మైదానంలో తిరుగుతూ కనిపించాడు. ఈ క్రమంలో టాస్ కి సిద్ధమైంది. ఆ వెంటనే సూర్య రిఫరీని కొద్దిసేపు ఆగండి, రోహిత్ భయ్యా వస్తున్నాడు. వెళ్లి కలసివస్తానంటూ చెప్పాడు. దీంతో రిఫరీ కూడా ఓ నిముషం ఆగాడు. ఆ వెంటనే రోహిత్ దగ్గరకు చేరుకున్న సూర్య ఆప్యాయంగా పలకరించి, కొన్ని టిప్స్ తీసుకున్నాడు.

యూఎస్ఏపై భారత్ గెలుపు..

భావోద్వేగాలు ఉప్పొంగినప్పటికీ, వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ ఉనికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యూఎస్ఏపై 29 పరుగుల తేడాతో గెలిచి, టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది.

భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలిన తర్వాత, సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 84 పరుగులతో అద్భుతంగా ఆడి జట్టును నిలబెట్టాడు. శివమ్ దూబే, అభిషేక్ శర్మ ఇద్దరూ గోల్డెన్ డక్‌లతో నిరాశపరిచారు. యూఎస్ఏతో మ్యాచ్ తర్వాత, భారత్ ఫిబ్రవరి 12న తమ తదుపరి గ్రూప్ దశ మ్యాచ్‌లో నమీబియాతో తలపడనుంది. ఆ తరువాత ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో మెగా ఐసీసీ ఈవెంట్‌లో కీలక మ్యాచ్ ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..