IND Vs NZ: తొలి టెస్ట్ ఓటమి.. టీమిండియాలో పలు కీలక మార్పులు..?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో విజయభేరి మ్రోగించిన కోహ్లీసేన తొలిసారిగా ఓటమి చవిచూసింది. కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీనితో రెండో టెస్టులో కీలక మార్పులు చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

IND Vs NZ: తొలి టెస్ట్ ఓటమి.. టీమిండియాలో పలు కీలక మార్పులు..?

Updated on: Feb 25, 2020 | 3:30 PM

IND Vs NZ: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో విజయభేరి మ్రోగించిన కోహ్లీసేన తొలిసారిగా ఓటమి చవిచూసింది. కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పూర్తిగా పేలవ ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, పేసర్ ఇషాంత్ శర్మ మినహాయిస్తే మిగిలిన వాళ్లందరిది ప్లాప్ షో.

Also Read: Netflix Amazing Offer For New Users. Rs 5 Month Subscription 

దీనితో రెండో టెస్టులో కీలక మార్పులు చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన పృథ్వీ షా అంచనాలను అందుకోలేకపోయాడు. వాస్తవానికి బీసీసీఐ హిట్‌మ్యాన్ ప్లేస్‌లో శుభ్‌మాన్ గిల్‌ను ఎంపిక చేసింది. కానీ తుది జట్టులో అతనికి అవకాశం ఇవ్వకుండా పృథ్వీ షాను ఆడించారు. రెండు ఇన్నింగ్స్ కలిపి 30 పరుగులు చేసిన అతడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో 29న మొదలుకానున్న రెండో టెస్టులో శుభమన్‌ గిల్‌కి ఛాన్స్ ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. అంతేకాకుండా గిల్‌ను ఆడించాలని అటు సీనియర్ల.. ఇటు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

‘గత రెండేళ్లుగా గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అంతకముందు జరిగిన న్యూజిలాండ్ ఏ సిరీస్‌లో కూడా అతడు అదరగొట్టాడు. శుభమన్‌ గిల్‌‌లో స్పెషల్ టాలెంట్ దాగి ఉంది. ఎందుకు టీమిండియా అతన్ని పక్కన పెడుతోందో తెలియట్లేదు. కొన్ని ఛాన్స్‌లు ఇస్తే తాను ఏంటో నిరూపించుకోగలడు. కనీసం రెండో టెస్టులోనైనా శుభమన్‌ గిల్‌కి అవకాశమివ్వాలని’ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.