AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం.. ప్లేయింగ్ 11లో చోటిస్తే చుక్కలే ఇక

IND vs ENG Today Match: ఏదేమైనా, బ్యాటింగ్ విభాగంలో మార్పులు ఎలా ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగంలో మాత్రం ఈ యంగ్ గన్ ఈరోజు మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు. గత వైఫల్యాలను మర్చిపోయి, సరికొత్త ఉత్సాహంతో ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపై మట్టికరిపించాలని టీం ఇండియా పట్టుదలగా ఉంది. మరి ఈ రసవత్తర పోరులో మన యువ భారత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం.. ప్లేయింగ్ 11లో చోటిస్తే చుక్కలే ఇక
Ind Vs Eng Playing 11
Venkata Chari
|

Updated on: Jul 01, 2026 | 3:50 PM

Share

IND vs ENG Today Match: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన చేదు అనుభవాలను పక్కనబెట్టి, టీం ఇండియా మరో మహా సమరానికి సిద్ధమైంది. నేటి నుంచే ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల ఉత్కంఠభరిత టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత యువ జట్టు ఎలా పుంజుకుంటుంది, సిరీస్ బోణీ కొట్టడానికి గౌతమ్ గంభీర్ ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాడనేది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఐర్లాండ్ పరాభవం నుంచి ఇంగ్లాండ్ సవాల్ వైపు..

ఐర్లాండ్‌తో జరిగిన గత సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా సీనియర్ల గైర్హాజరీలో బాధ్యత తీసుకుంటారనుకున్న సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్‌గా తొలి సిరీస్ అందుకున్న శ్రేయస్ అయ్యర్ అటు సారథిగా, ఇటు బ్యాటర్‌గా ఒత్తిడికి లోనై తడబడ్డాడు. దీంతో ఈ ఇంగ్లాండ్ పర్యటన అతడి కెరీర్‌కు అత్యంత కీలకమైన పరీక్షగా మారింది. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక మ్యాచ్‌లో మెరిసినా, తర్వాతి మ్యాచ్‌లో చేతులెత్తేసాడు. యువ బ్యాటర్ తిలక్ వర్మ అర్ధ సెంచరీ చేసినప్పటికీ, అతడి నెమ్మదైన ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. ఈ బ్యాటింగ్ వైఫల్యాలన్నింటినీ అధిగమించి, బలమైన ఇంగ్లాండ్ జట్టును వారి సొంత గడ్డపై ఢీకొట్టడం ఇప్పుడు యువ భారత్‌కు సవాల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: IND vs ENG 1st T20I: బుడ్డోడిని తొలి బంతికే ఇంటికి పంపిస్తా.. తొడగొట్టి మరీ సవాల్ చేసిన వైభవ్ దోస్త్..!

తుది జట్టులో ఆ యువ సంచలనం ఉండాల్సిందే..!

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత జట్టుకు కొండంత అండగా మారేందుకు ఒక యువ కెరటం సిద్ధంగా ఉంది. అతడే యువ పేసర్ ప్రిన్స్ యాదవ్. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్, తొలి మ్యాచ్‌లోనే మూడు కీలక వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన ఈ యువ బౌలర్, ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టీ20లోనూ తుది జట్టులో ఖచ్చితంగా ఉండాలని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రిన్స్ యాదవ్ గనుక తుది జట్టులో ఉంటే, ఇంగ్లాండ్ బ్యాటర్లకు పరుగులు చేయడం అంత సులభం కాదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను కట్టడి చేయడానికి ప్రిన్స్ యాదవ్ వైవిధ్యమైన బౌలింగ్ పదునైన ఆయుధంగా మారనుంది.

పేస్ త్రయం సిద్ధమైతే ప్రత్యర్థి కకావికలమే..

భారత పేస్ విభాగంలో ప్రిన్స్ యాదవ్‌కు తోడుగా స్టార్ బౌలర్ హర్షదీప్ సింగ్, యువ స్పీడ్‌స్టర్ హర్షత్ రాణా చేరితే టీం ఇండియా బౌలింగ్ లైనప్ అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఈ ముగ్గురి పేస్ త్రయం గనుక లయ అందుకుంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలం కావడం ఖాయంగా కనిపిస్తోంది. పవర్‌ప్లేలో వికెట్లు తీయడంతో పాటు, డెత్ ఓవర్లలో పరుగులను నియంత్రించగల సామర్థ్యం ఈ బౌలింగ్ కూర్పుకు ఉంది.

ఇది కూడా చదవండి: IND vs ENG: మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. టార్చర్‌కు సిద్ధమైన ఆర్చర్.. పెవిలియన్‌కు క్యూ కట్టాల్సిందే?

సూర్యవంశీ ఆడటం అనుమానమే.. టాప్ త్రీపైనే గంభీర్ నమ్మకం!

మరోవైపు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి తొలి టీ20 మ్యాచ్‌లో అవకాశం దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అనుభవానికే మొగ్గు చూపుతూ, టాప్ త్రీ స్థానాల్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లను ఆడించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగే తొలి రెండు టి20 మ్యాచ్‌లకు ఇదే బ్యాటింగ్ లైనప్ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌లలో టాప్ ఆర్డర్ విఫలమైతేనే, ఆ తర్వాత మ్యాచ్‌ల్లో వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ