IND vs ENG 1st T20 : భారత్‌తో తొలి టీ20.. ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
IND vs ENG 1st T20 : భారత్‌తో తొలి టీ20కు ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు విశ్రాంతి ఇవ్వగా, హ్యారీ బ్రూక్ సారథ్యంలో బలమైన జట్టుతో ఇంగ్లాండ్ బరిలోకి దిగుతోంది.

IND vs ENG 1st T20 : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 1 నుంచి ప్రారంభం కాబోతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. చేస్టర్-లే-స్ట్రీట్ వేదికగా జరగనున్న మొదటి మ్యాచ్ కోసం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు తమ అత్యంత పటిష్టమైన ప్లేయింగ్-11ను అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఐర్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్‌లో 0-2 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. ఈ ఇంగ్లాండ్ పర్యటనలో ఎలాగైనా గెలిచి మళ్లీ ఫామ్‌లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే, సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లోనే భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఇంగ్లాండ్ జట్టు కూడా విధ్వంసకర బ్యాటర్లతో కూడిన బలమైన లైనప్‌ను రంగంలోకి దించుతోంది. ఈ సిరీస్‌కు హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టులోని అత్యంత వేగవంతమైన, స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను మొదటి మ్యాచ్ తుది జట్టు నుంచి అకస్మాత్తుగా పక్కన పెట్టడం గమనార్హం. అయితే దీనికి ఎలాంటి గాయాలు కారణం కాదని, కేవలం వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే ఆర్చర్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు ఇంగ్లాండ్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌లో ఆర్చర్ నిరంతరాయంగా బౌలింగ్ చేయడం వల్ల, అతనికి ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చారు. ఆర్చర్ లేని లోటును పూడ్చేందుకు పేస్ బౌలింగ్ బాధ్యతలను ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్‌లకు అప్పగించారు. ఇక స్పిన్ విభాగంలో సీనియర్ ప్లేయర్ ఆదిల్ రషీద్‌తో పాటు లియామ్ డాసన్ మ్యాజిక్ చేయనున్నారు.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే టీమిండియా బౌలర్లకు గట్టి సవాల్ ఎదురుకాబోతుందని అర్థమవుతోంది. ఇన్నింగ్స్ ప్రారంభించడానికి స్టార్ ప్లేయర్స్ ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరూ క్రీజులో సెట్ అయితే పరుగుల వరద పారడం ఖాయం. ఇక మూడో స్థానంలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్వయంగా బ్యాటింగ్‌కు రానుండగా, మిడిలార్డర్‌లో జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, విల్ జాక్స్ వంటి హిట్టర్లు జట్టును బలోపేతం చేయనున్నారు. వీరికి తోడుగా ఆల్‌రౌండర్ కోటాలో సామ్ కరన్ జట్టుకు కీలకమైన బలంగా మారనున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఇంగ్లాండ్ సమతూకంగా కనిపిస్తోంది.
భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్
భారత క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌లను వీక్షించాలంటే కాస్త నిద్రను త్యాగం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి వేళల్లో ప్రారంభం కానున్నాయి. ఐదు మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది:
జూలై 1 (మొదటి టీ20): చేస్టర్-లే-స్ట్రీట్ మైదానం – రాత్రి 10:00 గంటలకు
జూలై 4 (రెండూ టీ20): మాంచెస్టర్ మైదానం – సాయంత్రం 7:00 గంటలకు
జూలై 7 (మూడో టీ20): నాటింగ్‌హామ్ మైదానం – రాత్రి 10:00 గంటలకు
జూలై 9 (నాలుగో టీ20): బ్రిస్టల్ మైదానం – రాత్రి 10:00 గంటలకు
జూలై 11 (ఐదో టీ20): సౌతాంప్టన్ మైదానం – సాయంత్రం 7:00 గంటలకు
తొలి టీ20 మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ పూర్తి ప్లేయింగ్-11
ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
