Telangana Elections: ప్రచార నుంచి పంపిణీ వరకు గిఫ్ట్ కార్డులు మొదలు మొబైల్ రీఛార్జిల వరకూ అంతా ఆన్లైన్..
ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే.. తినే తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు కాలు బయట పెట్టకుండానే ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రాజకీయాలు కూడా ఆన్లైన్లోకి ఎక్కేసాయి. ప్రచారం నుంచి పంపిణీ వరకు.. ఓటర్లకి ఆన్లైన్ సప్లై చేస్తున్నాయి పార్టీలు. రాజకీయ పార్టీలు ఎంత టెక్నాలజీ పెరిగిన భారీ ప్రచారాలు, బహిరంగ సభలు, ర్యాలీలో, రోడ్ షోలో వంటివి పెట్టక తప్పని పరిస్థితి. మెల్ల మెల్లగా ట్రెండ్ లో మార్పు వస్తున్నా.. ఇంకా తప్పని పరిస్థితుల్లో బహిరంగ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు.

ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే.. తినే తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు కాలు బయట పెట్టకుండానే ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రాజకీయాలు కూడా ఆన్లైన్లోకి ఎక్కేసాయి. ప్రచారం నుంచి పంపిణీ వరకు.. ఓటర్లకి ఆన్లైన్ సప్లై చేస్తున్నాయి పార్టీలు. రాజకీయ పార్టీలు ఎంత టెక్నాలజీ పెరిగిన భారీ ప్రచారాలు, బహిరంగ సభలు, ర్యాలీలో, రోడ్ షోలో వంటివి పెట్టక తప్పని పరిస్థితి. మెల్ల మెల్లగా ట్రెండ్ లో మార్పు వస్తున్నా.. ఇంకా తప్పని పరిస్థితుల్లో బహిరంగ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. దీంతోపాటే ఓటర్ మొబైల్ ఫోన్ లోకి డైరెక్ట్‌గా దూసుకుపోయే ప్రయత్నం కూడా జరుగుతుంది. అయితే ఇది గత ఎన్నికల నుంచే మొదలైనప్పటికీ.. ఇప్పుడు ఆ పద్దతి కొత్త పుంతలు తొక్కుతుంది. ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఫేస్‌బుక్ అకౌంట్లు, మొబైల్ నెంబర్లు, ఇంస్టాగ్రామ్ ఐడిలు సేకరిస్తున్నారు. ఏరియా పేరుతో, పట్టణం పేరుతో, బర్త్ ప్లేస్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో సెర్చ్ చేసి డేటా తయారు చేస్తున్నారు. కొన్ని ఏజెన్సీలు ప్రత్యేక సాఫ్ట్వేర్ల ద్వారా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల వివరాలు అందిస్తున్నాయి.
ఈమధ్య చాలామందికి సోషల్ మీడియా ఎకౌంట్ ఓపెన్ చేస్తే ఆ లోకల్ క్యాండిడేట్ల ప్రచారం ఆటోమేటిక్‌గా ప్రత్యక్షమవుతుంది. వాళ్లకు సంబంధించిన హామీలు, ప్రచార ఫోటోలు గంటకు దర్శనమిస్తున్నాయి. అంతేకాదు మొబైల్ నెంబర్లకి ఆటోమేటెడ్ వాయిస్ కాల్స్, మెసేజీలు తరచుగా వస్తూ ఉన్నాయి. ఇదంతా డేటా అనాలసిస్ ద్వారా సాధ్యమవుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే గత రెండేళ్ల నుంచి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల డేటాను పూర్తిగా సేకరించి పెట్టుకున్నారు. ఇలా నేరుగా వారి అకౌంట్లోకి కనెక్ట్ అయిపోయి పనిలో పనిగా మొబైల్ ప్రచారం చేస్తున్నారు.
ఇక ప్రచారంతోపాటు పంపిణీ కూడా ఆన్లైన్లోనే చేసే ఏర్పాటు జరుగుతున్నాయి. గూగుల్ పే ఫోన్ పే లాంటి యాప్ ల ద్వారా పేమెంట్లు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్‌గా ఉండడం పోలీస్ తనిఖీలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో ప్రత్యమ్నాయంగా తయిలాలకు సిద్ధమవుతున్నారు. బూత్‌ల వారిగా ఫోన్ నెంబర్లు తీసుకోవడంతో పాటు.. డిజిటల్ వాలెట్ ఏ నెంబర్‌తో లింక్ అయిందో కూడా సేకరిస్తున్నారు. ఇక మనీ వాలెట్ల పైన కూడా నిఘా ఉండడంతో.. స్థానిక నేతల నుంచి కాలనీ పెద్దలకు అక్కడి నుంచి ఓటర్లకు డిస్ట్రిబ్యూషన్ అయ్యేలా ప్లాన్ చేశారు. ఇక గిఫ్ట్ కార్డులు మరో రకం పంపిణీ.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మిత్రా లాంటి ఈ కామర్స్ షాపింగ్ గిఫ్ట్ కూపన్లను పంపిస్తున్నారు. ఇది నేరుగా అందజేయకుండా ఓటర్ల మొబైల్ ఫోన్లకు కూపన్ నెంబర్ను పంపించే ఏర్పాటు చేస్తున్నారు. ట్రెడిషనల్ ప్రచారంతోపాటు టెక్నాలజీని వాడుకుంటున్నాయి పార్టీలు. ఆన్లైన్ పేమెంట్లు, గిఫ్ట్ కార్డు నుంచి ఇంటర్నెట్ బిల్లులు, మొబైల్ రీఛార్జ్ లు చేయించేందుకు కూడా కొంతమంది సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




