కొత్త పార్లమెంట్‌లో పది ఆర్డినెన్స్‌లకు మోక్షం..?

కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం మొదటి పార్లమెంట్ సమావేశాలకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి లోక్‌సభ, 20 నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల వెల్లడించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చిలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తీసుకువచ్చిన పది ఆర్డినెన్స్‌లను.. ఈ సమావేశాల్లో చట్టాలుగా మార్చేలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోందట. అందులో ట్రిపుల్ తలాక్ రద్దు ఒకటి. గత సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ […]

కొత్త పార్లమెంట్‌లో పది ఆర్డినెన్స్‌లకు మోక్షం..?

కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం మొదటి పార్లమెంట్ సమావేశాలకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి లోక్‌సభ, 20 నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల వెల్లడించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చిలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తీసుకువచ్చిన పది ఆర్డినెన్స్‌లను.. ఈ సమావేశాల్లో చట్టాలుగా మార్చేలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోందట. అందులో ట్రిపుల్ తలాక్ రద్దు ఒకటి. గత సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ అంశం లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ.. రాజ్యసభలో ఆమోదం పొందలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా ట్రిపుల్ తలాక్‌ రద్దును చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ట్రిపుల్ తలాక్ రద్దుతో పాటు మెడికల్ కౌన్సిల్, కంపెనీస్, డిపాజిట్ పథకాలు, జమ్ము కశ్మీర్ రిజర్వేషన్, ఆధార్, న్యూ ఢిల్లీ ఇంటర్నేషనల్ అర్బిటేషన్ సెంటర్, హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్, స్పెషల్ ఎకనమిక్ జోన్, సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్‌లను కూడా చట్టాలుగా చేయాలని ఎన్డీయే ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే గత పార్లమెంట్‌ నుంచి కొనసాగుతున్న ఏదైనా ఆర్టినెన్స్‌ను చట్టంగా చేయాలంటే 45 రోజుల కాలపరిమితి మాత్రమే ఉంటుంది.

Click on your DTH Provider to Add TV9 Telugu