చిద్దూకి కార్తీ లేఖ.. మోదీని విమర్శిస్తూ బర్త్‌డే విషెస్!

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం ఇవాళ తన 74వ పుట్టినరోజు వేడుకలను తీహార్ జైలులో జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా కొడుకు కార్తీ చిదంబరం.. తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన జైలుకు వెళ్లిన నాటి నుంచి జరిగిన సంఘటనల సమాహారాన్ని వివరిస్తూ.. రెండు పేజీల లేఖను రాశారు. దీనిలో  కశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ, ఆర్థిక మందగమనం, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు, గురుత్వాకర్షణపై పీయూష్ గోయల్‌ చేసిన కామెంట్స్, అస్సాం ఎన్‌ఆర్‌సీ, మోదీ […]

చిద్దూకి కార్తీ లేఖ.. మోదీని విమర్శిస్తూ బర్త్‌డే విషెస్!
Follow us

|

Updated on: Sep 16, 2019 | 12:51 PM

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం ఇవాళ తన 74వ పుట్టినరోజు వేడుకలను తీహార్ జైలులో జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా కొడుకు కార్తీ చిదంబరం.. తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన జైలుకు వెళ్లిన నాటి నుంచి జరిగిన సంఘటనల సమాహారాన్ని వివరిస్తూ.. రెండు పేజీల లేఖను రాశారు. దీనిలో  కశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ, ఆర్థిక మందగమనం, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు, గురుత్వాకర్షణపై పీయూష్ గోయల్‌ చేసిన కామెంట్స్, అస్సాం ఎన్‌ఆర్‌సీ, మోదీ ప్రభుత్వం 100 రోజుల వేడుక గురించి ప్రస్తావించారు.

మా అందరి సమక్షంలో మీరు త్వరలోనే ఇంటి దగ్గర కేక్ కట్ పుట్టినరోజును జరుపుకుంటారని కార్తీ చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక మీరు 74వ ఏటలోకి అడుగుపెట్టడం.. మోదీ ప్రభుత్వం 100 రోజుల వేడుకను జరుపుకోవడానికి అసలు సంబంధం లేదని.. రెండు అంశాలు వేరువేరని అన్నారు.

అంతేకాకుండా ‘చంద్రయాన్ 2’ మిషన్ చంద్రుడిపై దిగేటప్పుడు చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల కంటే.. ఆ తర్వాత ఇస్రో సెంటర్ వేదికగా జరిగిన ఎమోషనల్ డ్రామాను చమత్కరిస్తూ లేఖలో రాశారు కార్తీ చిదంబరం. ఇస్రో చీఫ్ శివన్‌ తల నిమురుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓదార్చిన తీరు ఆయన సహచరులు భావించిన దానికంటే ఎక్కువగానే ఉన్నట్లు సైటైరికల్‌గా లేఖలో పేర్కొన్నాడు.