AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ టీషర్టులు ధరిస్తే ఏ వైరస్ సోకదట..!

కొవిడ్ తోపాటు ఇతర భయంకర వైరస్ లను నుంచి విముక్తి కలిగించేందుకు భారతదేశానికి చెందిన ఓ స్టార్టఫ్ కంపెనీ వినూత్నంగా ఆలోచన చేసింది. తాము తయారీ చేసిన టీ షర్టును ధరిస్తే ఎటువంటి వైరస్ అయినా దరి చేరదంటోంది.

ఆ టీషర్టులు ధరిస్తే ఏ వైరస్ సోకదట..!
Balaraju Goud
|

Updated on: Oct 04, 2020 | 3:38 PM

Share

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. నిత్యం పెరుగుతున్న కొత్త కేసులతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, కొవిడ్ తోపాటు ఇతర భయంకర వైరస్ లను నుంచి విముక్తి కలిగించేందుకు భారతదేశానికి చెందిన ఓ స్టార్టఫ్ కంపెనీ వినూత్నంగా ఆలోచన చేసింది. తాము తయారీ చేసిన టీ షర్టును ధరిస్తే ఎటువంటి వైరస్ అయినా దరి చేరదంటోంది. కొవిడ్ బారి నుంచి రక్షణ కల్పించే సరికొత్త టీషర్టులు, కెమికల్ లిక్విడ్ లోషన్ ను మన దేశానికి చెందిన రెండు స్టార్టఫ్ కంపెనీలు అభివృద్ధి చేశాయి. తక్కువ ధరకే అవి విపణిలో అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఇ-టెక్స్, క్లెన్స్‌టా అనే రెండు కంపెనీలు ఐఐటీ ఢిల్లీలో ఆధ్వర్యంలో వీటికి రూపకల్పన చేశాయి. ఇ-టెక్స్‌’ యాంటీ వైరల్‌ ఫ్యాబ్రిక్‌తో తాజాగా టీ-షర్టులను తయారు చేసింది. వాటి మనం ధరించడం ద్వారా మనకు వైరస్ సోకే ప్రమాదం లేదంటుంది సదరు కంపెనీ. టీ షర్ట్ ను తాకితే కరోనా వైరస్‌ సహా ఏ సూక్ష్మజీవులైనాసరే అంతమైపోతుందట. 30 సార్లు ఉతికిన తర్వాత కూడా యాంటీ వైరల్‌ సామర్థ్యాన్ని కోల్పోకపోవడం ఈ టీషర్టుల ప్రత్యేకత అని ఇ-టెక్స్ సంస్థ పేర్కొంది. వాటిపై ఉండే రసాయనం మానవులకు, ప్రకృతికి ఏమాత్రం హానికరం కాదని నిపుణులు తేల్చారు. మరోవైపు, తాము రూపొందించిన కెమికల్ లిక్విడ్ 99.9 శాతం వరకు సూక్ష్మక్రిములను నాశనం చేయగలదని క్లెన్స్‌టా సంస్థ తెలిపింది. ఒక్కసారి ఒంటిపై పూసుకుంటే 24 గంటల వరకు అది ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇ-టెక్స్‌ టీషర్టులు, క్లెన్స్‌టా లోషన్ తో కూడిన కిట్‌లను ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ వి.రామ్‌గోపాల్‌ రావు శుక్రవారం ఆవిష్కరించారు. వీటిని అతి తక్కువ ధరకే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. త్వరలో దేశీయ మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు వారు వెల్లడించారు.

Follow Us
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ