కోహ్లీ, రోహిత్‌లను వెనక్కినెట్టి.. కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన రాహుల్!

ICC T20 Rankings List: కివీస్‌తో జరిగిన టీ20ల్లో పరుగుల వరద పారించిన కేఎల్ రాహుల్.. ర్యాంకింగ్‌లో తన సత్తా చాటాడు. సిరీస్ ముగిసేసరికి రెండు హాఫ్ సెంచరీలతో 224 పరుగులు పూర్తి చేసిన అతడు టీ20 కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించాడు. సుమారు 50 పాయింట్ల తేడాతో ప్రస్తుతం రెండో స్థానంలో రాహుల్ కొనసాగుతుండగా.. పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం […]

కోహ్లీ, రోహిత్‌లను వెనక్కినెట్టి.. కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన రాహుల్!

ICC T20 Rankings List: కివీస్‌తో జరిగిన టీ20ల్లో పరుగుల వరద పారించిన కేఎల్ రాహుల్.. ర్యాంకింగ్‌లో తన సత్తా చాటాడు. సిరీస్ ముగిసేసరికి రెండు హాఫ్ సెంచరీలతో 224 పరుగులు పూర్తి చేసిన అతడు టీ20 కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించాడు. సుమారు 50 పాయింట్ల తేడాతో ప్రస్తుతం రెండో స్థానంలో రాహుల్ కొనసాగుతుండగా.. పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉండగా భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉండగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మూడు స్థానాలు ఎగబాకి టాప్ 10 లిస్టులోకి చేరిపోయాడు. అటు శ్రేయాస్ అయ్యర్(55), మనీష్ పాండే(58)లు కూడా తమ ర్యాంక్‌లను మెరుగుపరుచుకున్నారు. కాగా, కివీస్‌తో జరిగిన చివరి టీ20లో భారత్ విజయం సాధించి 5-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక బౌలర్ల విషయానికి వస్తే యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా 11వ స్థానానికి చేరుకోగా.. చాహల్(30), శార్దూల్(30). నవదీప్ సైనీ(71). జడేజా(76)లు తమ ర్యాంకులను సైతం మెరుగుపరుచుకున్నారు.

మరోవైపు కివీస్ ప్లేయర్స్ లిస్ట్‌ను ఒకసారి పరిశీలిస్తే.. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ 16వ ర్యాంక్‌లో ఉండగా.. టిమ్‌ సీఫర్ట్‌ (34), రాస్‌ టేలర్‌ (39) స్థానాల్లో ఉన్నారు. ఇక స్పిన్నర్ సోధి 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, భారత్ కివీస్‌తో సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో నాలుగో స్థానానికి ఎగబాకింది. దాయాది దేశం పాకిస్థాన్ మాత్రం 270 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Published On - 6:06 pm, Mon, 3 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu