AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup 2027: 14 టీంలు, 48 రోజులు.. వన్డే ప్రపంచకప్ 2027 డేట్స్ ఫిక్స్.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

ODI World Cup 2027 Dates Out: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్-2027 షెడ్యూల్ ఎట్టకేలకు వచ్చేసింది. 2027 అక్టోబర్ 4 నుండి నవంబర్ 21 వరకు 48 రోజుల పాటు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జరనున్నట్టు తెలుస్తోంది. తాజాగా అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ తేదీలను ఖరారు చేసినట్టు సమాచారం.

ODI World Cup 2027: 14 టీంలు, 48 రోజులు.. వన్డే ప్రపంచకప్ 2027 డేట్స్ ఫిక్స్.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
Odi World Cup 2027 Dates Out
Anand T
|

Updated on: Jun 11, 2026 | 7:52 PM

Share

క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్‌ కప్ తాత్కాలిక షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 4 నుండి నవంబర్ 21 ఈ మెగా టోర్నీ జరగనున్నట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలలో ఈ మ్యాచ్‌లు జరగనున్నట్టు తెలుస్తోంది. గత నెలలో అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌ ఈ తేదీలపై ఏకాభిప్రాయం కుదిరిందని.. జూలైలో ఎడిన్‌బర్గ్‌లో జరగబోయే ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ తేదీలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేశాయి.

ఈ నివేదిక ప్రకారం..ఈ మెగా టోర్నీలోని మెజారిటీ మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలోనే జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్‌ మొత్తంలో 54 మ్యాచ్‌ల జరగనుండగా అందులో సుమారు 41 మ్యాచ్‌లుకు దక్షిణాఫ్రికాలోని 8 స్టేడియాలు ఆతిత్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక జింబాబ్వేలోని విక్టోరియా ఫాల్స్, హరారే స్పోర్ట్స్ క్లబ్, బులవాయోలోని క్వీన్స్ స్టేయాల్లో 8 నుండి 10 మ్యాచ్‌లు జరగనుండగా మిగతా మూడు మ్యాచ్‌లు నమీబియాలో జరగనున్నాయి.

అయితే ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, మహిళల టీ20 ప్రపంచ కప్‌లకు ఆతిథ్యం ఇచ్చిన సౌత్రాఫ్రికా 2003 మూడు తర్వాత తొలిసారి మెన్స్‌ వరల్డ్‌ కప్ టోర్నమెంట్‌ను నిర్వహించబోతుంది. అయితే ఈ వరల్డ్‌ కప్ టోర్నమెంట్‌ను పాత పద్దతిలోనే నిర్వహించబోతుంది. గతంలో జరిగిన రెండు ఎడిషన్లలో కేవలం 10 జట్లే పాల్గొనగా.. తాజాగా 2027లో జరగబోయే మెన్స్ వరల్డ్‌ కప్‌లో మళ్లీ 14 జట్ల ఫార్మాట్‌ను తీసుకురాబోతున్నారు.

అంటే మొత్తం 14 జట్లను రెండు గ్రూప్‌లుగా డివైడ్ చేసి.. ప్రతి గ్రూప్ నుండి టాప్‌ 3 స్థానాల్లో నిలిచిన జట్లను సూపర్ సిక్స్‌కు ఎంపిక చేస్తారు. ఇక ఐసీసీ సభ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు దీనికి నేరుగా అర్హత సాధించగా, నమీబియా మాత్రం క్వాలిఫికేషన్ మ్యాచ్ ఆడిన తర్వాత సూపర్ సిక్స్‌కు రావాల్సి ఉంటుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us