IBPS Recruitment 2021: ఇంజనీరింగ్ పాసైనవారికి మంచి సాలరీతో ఉద్యోగావకాశాలు.. ఎలా అప్లై చేయాలంటే..

|

Oct 01, 2021 | 8:01 AM

IBPS Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన..

IBPS Recruitment 2021: ఇంజనీరింగ్ పాసైనవారికి మంచి సాలరీతో ఉద్యోగావకాశాలు.. ఎలా అప్లై చేయాలంటే..
Ibps Recruitment
Follow us on

IBPS Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈరోజు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ అప్లికేషన్లు స్వీకరించడానికి చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు అప్లికేషన్లను ఆన్ లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కోసం https://ibps.in/   తో మరిన్ని వివరాలను తెలుసుకోవాల్సి ఉంది. 

ఉద్యోగం పూర్తి వివరాలు :

జాబ్ రోల్ : అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ రిసెర్చ్ అసోసియేట్స్, రిసెర్చ్ అసోసియేట్స్, హిందీ ఆఫీసర్లు, ఐటీ ఇంజినీర్లు, ఐటీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు తదితరాలు.

మొత్తం ఖాళీలు : 50

విద్యార్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ , బీటెక్ , ఎంసీఏ , ఎమ్మెస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉద్యోగం లో ఎక్స్ పీరియన్స్ ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యం ఉండాలి.

వయస్సు : పోస్ట్ ని అనుసరించి 21 – 45 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ. 60,000 – 1,80,000/-

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్, ఐటమ్ రైటింట్ ఎక్సర్ సైజ్, గ్రూప్ ఎక్సర్ సైజెస్, ప్రెజెంటేషన్ ఎక్సర్ సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 1000/-

Also Read:  ఈ రోజు ఈ రాశి స్త్రీలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..