ఐబీఎం నూతన సీఈఓగా.. తెలుగుతేజం.. అరవింద్ కృష్ణ!

| Edited By: Pardhasaradhi Peri

Feb 01, 2020 | 4:30 PM

తెలుగు వాడి సత్తా ఏంటో మరోసారి రుజువైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన ఓ తెలుగు తేజం దిగ్గజ సాప్ట్‌వేర్‌ కంపెనీకి నాయకత్వం వహించనున్నారు. అమెరికా టెక్‌ కంపెనీ IBMకి CEOగా తెలుగువాడైన అరవింద్‌ కృష్ణా నియమితులయ్యారు. ప్రపంచస్థాయి కంపెనీలకు సీఈవోలుగా నియమితులైన నాలుగో వ్యక్తిగా అరవింద్‌ కృష్ణ.. చరిత్ర సృష్టించబోతున్నారు. ఐబీఎమ్‌లో ప్రస్తుతం..క్లౌడ్‌..కాగ్నిటివ్‌ సాప్ట్‌వేర్‌ విభాగానికి..సీనియర్‌ వైస్‌ ప్రసిడెంట్‌గా వ్యవహరిస్తున్న కృష్ణ….. వర్జీనియాకు చెందిన గిన్నీ రోమెట్టి స్థానంలో సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నాడు… కృత్రిమ మేధ..క్లౌడ్‌..క్వాంటమ్‌ […]

ఐబీఎం నూతన సీఈఓగా..  తెలుగుతేజం.. అరవింద్ కృష్ణ!
Follow us on

తెలుగు వాడి సత్తా ఏంటో మరోసారి రుజువైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన ఓ తెలుగు తేజం దిగ్గజ సాప్ట్‌వేర్‌ కంపెనీకి నాయకత్వం వహించనున్నారు. అమెరికా టెక్‌ కంపెనీ IBMకి CEOగా తెలుగువాడైన అరవింద్‌ కృష్ణా నియమితులయ్యారు. ప్రపంచస్థాయి కంపెనీలకు సీఈవోలుగా నియమితులైన నాలుగో వ్యక్తిగా అరవింద్‌ కృష్ణ.. చరిత్ర సృష్టించబోతున్నారు. ఐబీఎమ్‌లో ప్రస్తుతం..క్లౌడ్‌..కాగ్నిటివ్‌ సాప్ట్‌వేర్‌ విభాగానికి..సీనియర్‌ వైస్‌ ప్రసిడెంట్‌గా వ్యవహరిస్తున్న కృష్ణ….. వర్జీనియాకు చెందిన గిన్నీ రోమెట్టి స్థానంలో సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నాడు…

కృత్రిమ మేధ..క్లౌడ్‌..క్వాంటమ్‌ కంప్యూటింగ్‌..బ్యాక్‌ చైన్‌ వంటి సాంకేతికతను అభివృద్ధి చేయడంలో అరవింద్‌ కృష్ణ కీలక పాత్ర పోషించారు…కృష్ణ పనితీరును చూసిన ఐబీఎమ్‌ బోర్డు డైరెక్టర్లు రానున్న కాలంలో కంపెనీ అభివృద్ధికి కృష్ణే సరైన వ్యక్తని నమ్మి ఈ అవకాశం ఇచ్చారు…ఏప్రిల్‌ ఆరు నుంచి అరవింద్‌ కృష్ణ నియామకం అమలులోకి రానుంది..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పశ్చిమ గోదావరికి చెందిన కృష్ణ..ఐఐటి కాన్పూర్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పూర్తి చేశారు..యూనివర్సిటీ ఆఫ్‌ ఇలినాయిస్‌ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు..15 పేటెంట్లకు రచయితగాఉన్న ఆయన..1990లో ఐబీఎమ్‌లో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు..ఐబీఎమ్‌ రీసెర్చ్‌..ఐబీఎమ్‌ క్లౌడ్‌..ఐబీఎమ్‌ సాప్ట్‌వేర్‌ వంటి వాటిలో కీలక బాధ్యతలు నిర్వహించారు…

అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న..తెలుగువాళ్లల్లో అరవింద్‌కృష్ణ నాలుగో వ్యక్తి..ఇంతకు ముందు మైక్రోసాప్ట్‌ సీఈవోగా సత్యానాదేళ్ల..గూగుల్‌ సారథిగా తెలుగు మూలాలున్న సుందర్‌ పిచ్చాయ్….అడోబ్‌ కంపెనీకి.. శంతను నారాయణ్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు..యూఎస్‌లో అధిక మార్కెట్‌ విలువ గల ఈ అంతర్జాతీయ కంపెనీలకు ఓ తెలుగు వాడు సారథ్యం వహించడం పట్ల మొదట్లో అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.. కాని సత్య నాదెళ్లతో మొదలైన ఆ ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది.

హైదరాబాద్‌కి చెందిన సత్య నారాయణ నాదెళ్ల..మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్‌ అండ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ విభాగానికి వైస్‌ ప్రసిడెంట్‌గా పనిచేసి..2014 ఫిబ్రవరి 5న మైక్రోసాప్ట్‌ సీఈవోగా నియమితులైయ్యారు. 1976నుండి బిల్‌గేట్స్‌..బాల్మేర్‌ తర్వాత మైక్రోసాఫ్ట్ కి మూడో సీఈవోగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించాడు..అలా నాదెళ్ల ..తర్వాత తెలుగు మూలాలున్న సుందర్‌ పిచాయ్‌..2004లో గూగుల్‌లో ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఉపాధ్యక్షుడిగా చేరి..సెర్చి ఇంజన్‌లలో దిగ్గజంగా ఎదిగేందుకు తోడ్పడిన టూల్‌ బార్‌ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి 2014లో గూగుల్‌ సీఈవోగా అవతరించాడు.

హైదరాబాద్‌కి చెందిన మరో టెక్కీ శంతన్‌ నారాయణ్‌ కూడా హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ స్థాయి నుంచి..అడోబ్‌ కంపెనీ సీఈవోగా ఎదిగాడు ఓ సాధారణ ప్లాస్టిక్‌ కంపెనీ నడిపే మధ్యతరగతి కుటుంబానికి చెందిన శంతన్‌..ఉస్మానియా నుంచి ఎలక్ట్రానిక్స్‌లో బి.ఇ పూర్తి చేశాడు..తరువాత ఓహియోలోని బౌలింగ్‌ గ్రీన్‌ యూనివర్సిటీ నుంచి ఎంఎస్‌ పట్టా పొంది అడోబ్‌ కంపెనీలో చేరాడు అనంతర కాలంలో అంచలంచెలుగా ఎదుగుతూ సీఈవో స్థాయికి చేరాడు.ఇప్పుడు వెస్ట్‌ గోదావరికి చెందిన అరవింద్‌ కృష్ణా కూడా ఐబీఎమ్‌ కంపెనీ పగ్గాలు చేపట్టి రానున్న తెలుగు టెక్కీలకు ఆదర్శంగా నిలిచాడు.