ఆ హత్యతో నాకు సంబంధం లేదు.. కోగంటి సత్యం
సంచలనం రేపుతున్న విజయవాడ పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యం మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చాడు. తాను ఎలాంటి హత్య చేయించలేదని, రాం ప్రసాద్‌ను చంపితే తనకు రావాల్సిన డబ్బు ఎలా వస్తుందని ప్రశ్నించాడు కోగంటి సత్యం. తనకు ఇవ్వాల్సిన డబ్బును ఎగ్గొట్టడానికే తనపై అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుడు కేసులు బనాయించారని చెప్పుకొచ్చాడు. తాను ఎప్పుడు డబ్బు అడిగినా విజయవాడ పోలీసుల సహకారంతో కేసులు పెట్టాడని చెప్పాడు. గతంలో ఇంటిలిజెన్స్ […]
సంచలనం రేపుతున్న విజయవాడ పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యం మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చాడు. తాను ఎలాంటి హత్య చేయించలేదని, రాం ప్రసాద్‌ను చంపితే తనకు రావాల్సిన డబ్బు ఎలా వస్తుందని ప్రశ్నించాడు కోగంటి సత్యం. తనకు ఇవ్వాల్సిన డబ్బును ఎగ్గొట్టడానికే తనపై అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుడు కేసులు బనాయించారని చెప్పుకొచ్చాడు. తాను ఎప్పుడు డబ్బు అడిగినా విజయవాడ పోలీసుల సహకారంతో కేసులు పెట్టాడని చెప్పాడు. గతంలో ఇంటిలిజెన్స్ ఐజీ స్ధాయిలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించాడు.
రాం ప్రసాద్ తనకు మధ్య ఆర్ధిక లావాదేవీలు నడిచిన మాట వాస్తవమేనని తెలిపాడు. అగ్రిమెంట్ ప్రకారం రూ.23 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నాడు. గత 20 రోజుల క్రితమే ఒక ఫంక్షన్‌లో కలిసి ఇద్దరం మాట్లాడుకున్నామని, అప్పడు కూడా డబ్బులు ఎప్పుడిస్తావని అడిగానని చెప్పాడు. రాం ప్రసాద్ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు కోగంటి సత్యం. విజయవాడ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా నుంచి షేర్లు కొన్న తర్వాత ఫ్యాక్టరీని నష్టాల్లోకి తీసుకెళ్లాడని ఆరోపిస్తూనే ఈ హత్య వెనుక బోండా ఉమా హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేశాడు .. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరపున తాను పనిచేయడంతో.. ఈ హత్య ఎవరో చేసి తనపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపించాడు.
హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన ఈ హత్యను దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తప్పకుండా సహకరిస్తానని, తనకు పోలీసులు, చట్టంపై నమ్మకముందన్నాడు.