AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HYDRA: ఆధారాలుంటే ఏసీబీ దృష్టికి తీసుకెళ్లండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణలపై స్పందించిన రంగనాథ్‌..

కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ క్లారిటీ ఇచ్చారు. హైడ్రా లావాదేవీలు జరిపినట్లు ఆధారాలుంటే ఏసీబీకి ఫిర్యాదు చేయాలన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదంటూ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రత్యక్షంగానీ ప‌రోక్షంగా కానీ హైడ్రా పేరును వాడుకుని వసూళ్లకు పాల్పడే వారిపై క‌ఠిన శిక్ష పడేలా చేస్తామని రంగనాథ్ తెలిపారు.

HYDRA: ఆధారాలుంటే ఏసీబీ దృష్టికి తీసుకెళ్లండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణలపై స్పందించిన రంగనాథ్‌..
Ranganath Anirudh Reddy
Shaik Madar Saheb
|

Updated on: Mar 19, 2025 | 9:40 AM

Share

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ​ఫోన్ చేసినా రెస్పాండ్ కారని.. ముందు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత హైడ్రా సెటిల్మెంట్లు చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. వంశీరాం బిల్డర్స్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేనే పట్టించుకోకపోతే సామన్యుల పరిస్థితి ఏంటంటూ అనిరుధ్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.. అయితే.. అనిరుధ్‌ కామెంట్స్‌పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.. వంశీరాం బిల్డర్స్‌పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఫోన్ కాల్‎కు రెస్పాండ్ కాకపోయిన.. ఏవైనా ఫిర్యాదులు చేయాల్సి ఉంటే వాట్సాప్ మేసేజ్ చేసినా స్పందిస్తామని చెప్పారు.

అలాగే.. ప్రజాప్రతినిధులు చేసే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తామని రంగనాథ్ పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చి హైడ్రా లావాదేవీలు చేస్తోందని ఆరోపించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. అందుకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే పోలీసులు, విజిలెన్స్ లేకపోతే ఏసీబీ దృష్టికి తీసుకెళ్లవచ్చని రంగనాథ్‌ అన్నారు.

తనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదంటూ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రత్యక్షంగానీ ప‌రోక్షంగా కానీ హైడ్రా పేరును వాడుకుని వసూళ్లకు పాల్పడే వారిపై క‌ఠిన శిక్ష పడేలా చేస్తామని రంగనాథ్ తెలిపారు. హైడ్రాకు కంప్లైంట్ వస్తే.. దశాబ్దాల సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం లభిస్తుందని చెప్పుకొచ్చారు.

కాస్త ఆలస్యమైనా.. తప్పకుండా తమ వద్దకు వచ్చిన ప్రతీ ఫిర్యాదుకు పరిష్కారం చూపిస్తామని రంగనాథ్ తెలిపారు. ఆక్రమణలపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..