AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్లవారితే పెళ్లి.. ఇంటి నిండా బంధువులు.. అర్ధరాత్రి పక్కింటి ఆంటీతో వరుడు జంప్!

హైదరాబాద్ పాతబస్తీలో పెళ్లికి కొన్ని గంటల ముందు ఊహించని ఘటన కలకలం రేపింది. ఖలీల్ అనే వరుడు పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన సమయానికి పక్కింటి మహిళతో కలిసి జంప్ అయ్యాడు. వధువు కుటుంబం లక్షలు ఖర్చు చేసి తీవ్ర మనస్తాపానికి గురికాగా, వధువు ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పాతబస్తీలో చర్చనీయాంశంగా మారింది.

తెల్లవారితే పెళ్లి..  ఇంటి నిండా బంధువులు.. అర్ధరాత్రి పక్కింటి ఆంటీతో వరుడు జంప్!
Groom Elopes With Neighbor
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Oct 02, 2026 | 2:10 PM

Share

హైదరాబాద్ పాతబస్తీలో పెళ్లికి కొన్ని గంటల ముందు ఊహించని ఘటన కలకలం రేపింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఖలీల్‌కు బాలాపూర్ ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. రెండు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి తేదీని ఖరారు చేసుకున్నారు. పెళ్లి పత్రికలు పంచడంతో పాటు ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేశారు. ఇళ్లలో పెళ్లి సందడి మొదలైంది.

అయితే పెళ్లికి ఒక్క రోజు ముందు రాత్రి ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. కాబోయే పెళ్లికొడుకు ఖలీల్ కనిపించకుండా పోయాడు. అతడు పక్కింట్లో నివసించే ఓ మహిళతో కలిసి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. దీంతో వరుడి కుటుంబంలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఖలీల్ కనిపించడం లేదన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే వధువు కుటుంబానికి సమాచారం ఇచ్చారు. పెళ్లికి మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది

ఇప్పటికే పెళ్లి ఏర్పాట్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంతో వధువు కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. వరుడు చివరి నిమిషంలో కనిపించకుండా పోయాడన్న విషయం తెలుసుకున్న కాబోయే వధువు తీవ్ర ఆవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తర్వాత వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కనిపించకుండా పోయిన ఖలీల్ కోసం గాలింపు చేపట్టారు.

పెళ్లికి ముందే ఖలీల్‌కు ఆ మహిళతో పరిచయం ఉంది. ఇద్దరూ ముందుగానే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇంట్లోని వారి పెళ్లి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దీంతో పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, సదరు మహిళకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె కూడా కనిపించకపోవడంతో ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పెళ్లికి గంటల ముందు వరుడు కనిపించకుండా పోవడంతో రెండు కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. అసలు ఖలీల్ ఎక్కడ ఉన్నాడు? అతడితో వెళ్లినట్లు చెబుతున్న మహిళ ఎక్కడ ఉంది? ఇద్దరూ ఎందుకు వెళ్లిపోయారు? పోలీసులు వారిని గుర్తించి తీసుకొస్తే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు.. చివరి నిమిషంలో కనిపించకుండా పోవడం ఇప్పుడు పాతబస్తీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది పోలీసుల దర్యాప్తుతో తేలాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us