ప్రేమ విఫలమై.. పాకిస్తాన్ చెరలో.. హైదరాబాదీ టెక్కీ .. ఏమిటా కథ ?

హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్ అనే టెక్కీ పాకిస్తాన్ లో అరెస్టయ్యాడు. అతడితో బాటు మధ్యప్రదేశ్ నివాసి అయిన దరీలాల్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరును కూడా అరెస్టు చేసినట్టు అక్కడి మీడియా తెలిపింది. విశాఖకు చెందిన ఇతని కుటుంబం సుమారు అయిదేళ్లుగా కూకట్ పల్లిలో నివాసం ఉంటోంది. మాదాపూర్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. రెండేళ్ల క్రితమే ప్రశాంత్ ఇంటినుంచి వెళ్ళిపోయాడట దీనిపై అతని తండ్రి బాబూరావు 2017 ఏప్రిల్ 29 న […]

ప్రేమ విఫలమై.. పాకిస్తాన్ చెరలో.. హైదరాబాదీ టెక్కీ .. ఏమిటా కథ ?
Follow us
Anil kumar poka

|

Updated on: Nov 19, 2019 | 1:45 PM

హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్ అనే టెక్కీ పాకిస్తాన్ లో అరెస్టయ్యాడు. అతడితో బాటు మధ్యప్రదేశ్ నివాసి అయిన దరీలాల్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరును కూడా అరెస్టు చేసినట్టు అక్కడి మీడియా తెలిపింది. విశాఖకు చెందిన ఇతని కుటుంబం సుమారు అయిదేళ్లుగా కూకట్ పల్లిలో నివాసం ఉంటోంది. మాదాపూర్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. రెండేళ్ల క్రితమే ప్రశాంత్ ఇంటినుంచి వెళ్ళిపోయాడట దీనిపై అతని తండ్రి బాబూరావు 2017 ఏప్రిల్ 29 న మాదాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారుకూడా. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లి.. అక్కడి సంస్థలో పని చేస్తున్నప్పుడు ప్రశాంత్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడని, అయితే అది విఫలం కావడంతో మానసిక ఒత్తిడికి గురై రాజస్తాన్ వెళ్లి.. పొరబాటున పాకిస్తాన్ భూభాగంలో అడుగు పెట్టాడని తెలుస్తోంది. అక్కడి బహావల్పూర్ వద్ద కొలిస్తాన్ ఎడారిలో ఇతడిని, దరీలాల్ ను పాక్ అధికారులు అరెస్టు చేశారు.

వీరివద్ద ఎలాంటి పాస్ పోర్టు, వీసా లేవని తెలిసింది. ప్రశాంత్ తెలుగులో మాట్లాడిన ఓ వీడియో పాక్ వెబ్ సైట్లలో చక్కర్లు కొడుతోందట. ఆ వీడియోలో.. తన తలిదండ్రులను ఉద్దేశించి.తను నెలరోజుల్లో విడుదల కావచ్చునని, ఖైదీల పరస్పర మార్పిడిలో భాగంగా తనను భారత్ కు పంపివేస్తారని ప్రశాంత్ పేర్కొన్నాడట.. కాగా-ఈ యువకుడు బహుశా మతిస్థిమితం కోల్పోయిఉండవచ్ఛునని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తమ కుమారుడు చాలా మంచివాడని, ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకూ పాల్పడే వ్యక్తి కాదని ప్రశాంత్ తండ్రి బాబూరావు అంటున్నారు. ఢిల్లీలో భారత రాయబార కార్యాలయానికి వెళ్లి తమ కుమారుడ్ని పాక్ అధికారులు క్షేమంగా విడుదల చేయించేలా చొరవ తీసుకోవాలని కోరుతామని ఆయన చెబుతున్నారు.

కాగా-ప్రశాంత్ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు ఆరా తీస్తున్నారు. దాదాపు పది నెలల క్రితమే భారత ‘ రా ‘ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్ ఒకరు బాబూరావు దగ్గరకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారట. అప్పుడే ప్రశాంత్ వివరాలపై ఆ ఏజెంటు ఆరా తీశాడని సమాచారం. . ప్రశాంత్ పాకిస్తాన్ లో ఉన్నట్టు బాబూరావుకు ఆ నాడే వెల్లడించాడని కూడా తెలుస్తోంది. అయితే.. దీనిపై బాబూరావు నుంచి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.