AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్పపీడనం ఎఫెక్ట్.. ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం ఎండ తీవ్రంగా ఉండగా.. సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎల్‌బీనగర్‌, మణికొండ, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం నమోదైంది. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

అల్పపీడనం ఎఫెక్ట్.. ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Aug 12, 2026 | 4:09 PM

Share

అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ రాగా.. సాయంత్రం వేళ వర్షం కురిసింది. నగరంలోని పలుచోట్ల జోరు వాన కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎల్‌బీనగర్ సహా.. హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మణికొండ, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో మోస్తరు వాన కురిసింది. అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌లో వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ వర్షం కురుస్తోంది.. దీంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరు వాన కురుస్తోంది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం, ఈ రోజు, 12 ఆగస్టు 2026, ఉదయం 08:30 గంటల (IST) సమయానికి అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ, ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశగా వంగి ఉంది. రుతుపవన ద్రోణి (Monsoon trough) ఈరోజు బికనీర్, వాయువ్య మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలోని అల్పపీడన కేంద్రం, సత్నా, డాల్టన్‌గంజ్, పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలకు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రాల మీదుగా ప్రయాణిస్తూ, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.

మధ్య – దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారుగా 22°N అక్షాంశం వెంబడి, సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఏర్పడిన షియర్ జోన్, ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశగా వంగి ఉంటూ కొనసాగుతోంది.

తెలంగాణ రాష్టంలో వాతావరణ సూచన (FORECAST)

బుధవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

గురువారం, శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాగల మూడు రోజులలో క్రింది స్థాయి ఉపరితల గాలుల వేగం 30 నుంచి 40 కి.మీ వరకు కొన్ని ప్రాంతాలలో కొనసాగే అవకాశం ఉంది.

హెచ్చరికలు (WARNINGS)

ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంభీమ్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Follow Us