హైదరాబాద్‌లో పట్టుబడిన రూ.100 కోట్ల డ్రగ్స్
Drugs Seized in Hyderabad : డ్రగ్ మాఫియాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోతున్నారు. తాజాగా మరో డ్రగ్ రాకెట్ గుట్టురట్టయింది. హైదరాబాద్ నగర శివారులో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు. వారు జరిపిన దాడుల్లో 250 కిలోల మత్తు మందును పట్టుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 50 కోట్ల విలువైన రా మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో […]

Drugs Seized in Hyderabad : డ్రగ్ మాఫియాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోతున్నారు. తాజాగా మరో డ్రగ్ రాకెట్ గుట్టురట్టయింది. హైదరాబాద్ నగర శివారులో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు. వారు జరిపిన దాడుల్లో 250 కిలోల మత్తు మందును పట్టుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
50 కోట్ల విలువైన రా మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఈ మత్తు మందు తయారు చేస్తున్నట్లుగా గుర్తించిన అధికారలు.. స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ కంపెనీ నుంచి కార్గో బస్‌లో ముంబై తరలిస్తుండగా పక్కా సమాచారంతో రెయిడ్ చేసి పట్టుకున్నారు. అయితే 2017లో అరెస్టయిన డ్రగ్ డీలర్‌నే ఇప్పుడు మళ్లీ పట్టుబడటం విశేషం. దీని వెనుక ఉన్న పెద్ద తలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎంత కాలంగా ఈ దందా నడుస్తుందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.




