AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాల సెన్సార్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సెన్సార్‌ బోర్డ్!

కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఊరటనిచ్చేందుకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సెన్సార్ బోర్డ్) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని సినిమాల..

సినిమాల సెన్సార్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సెన్సార్‌ బోర్డ్!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 14, 2020 | 1:09 PM

Share

కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఊరటనిచ్చేందుకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సెన్సార్ బోర్డ్) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని సినిమాల విడుదలలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఈ లాక్‌డౌన్ కారణంగా చిన్న సినిమా నిర్మాతలు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో వారు ఓటీటీలో వారి సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నారు. దీంతో వారంతా తమ చిత్రాలకు సెన్సార్ చేయాలని కోరుతున్నారు. అయితే ఈ విషయంపై హైదరాబాద్ సెన్సార్ బోర్డు స్పందించింది.

తాజాగా ఈ సంస్థ చైర్మన్ దేశంలో ఉన్న ముఖ్యమైన నగరాల్లోని ప్రాంతీయ సెన్సార్ కార్యాలయాల అధికారులతో చర్చించారు. ఈ మేరకు ప్రాథమికంగా రెండు అంశాలపై నిర్మాతలకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ అధికారి వి బాలకృష్ణ వెల్లడించారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ వల్ల నిర్మాతలకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత త్వరగా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలని నిర్ణయించాం. సినిమా సెన్సార్‌కు నిర్మాతలు వ్యక్తిగతంగా హాజరు కాకున్నా ఆన్‌లైన్‌లో సందప్రదించి, ఈ-మెయిల్‌లో సర్టిఫికెట్లు జారీ చేస్తాం. అలాగే నిర్మాత కోరుకున్న చోట సెన్సార్‌కు ఏర్పాట్లు చేసి, సినిమాను హార్డ్ డిస్క్, క్యూబ్‌లలో తీసుకొచ్చినా సెన్సార్ చేస్తామన్నారు పేర్కొన్నారు బాలకష్ణ. దీంతో చిన్న సినిమాల నిర్మాతలకు కాస్త ఊరట లభించినట్లైంది.

Read More:

గుడ్‌న్యూస్: అక్కడ విద్యార్థులకు టెన్త్ పరీక్షలు లేవు.. డైరెక్ట్ పాస్!

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

లాక్‌డౌన్‌లో సింపుల్‌గా హీరో నిఖిల్ పెళ్లి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..