దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పల్టీ కొట్టిన కారు

హైదరాబాద్ కే తలమానికంగా నిర్మించిన మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పల్టీ కొట్టిన కారు
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 05, 2020 | 3:47 PM

హైదరాబాద్ కే తలమానికంగా నిర్మించిన మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. బ్రిడ్జ్ మొదలు పెట్టినప్పటి నుండే ఈ బ్రిడ్జ్ మీదకు జనం ఎగబడడం మొదలయింది. తాజాగా కేబుల్‌ బ్రిడ్జిపై ఓ కారు ప్రమాదానికి గురైంది. ఓ కారు టైరు పేలి వంతెనపై పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడింది. కారు బోల్తా పడగానే అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఘటనలో కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గురైన కారును తీసువేసి ట్రాఫిక్ ను పునురద్దరించారు. ఈ ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.