AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడితో కలిసి అమ్మమ్మ ఇంటినే కొల్లగొట్టింది..!

ప్రియుడితో కలిసి సొంత నాయనమ్మ ఇంటిలోనే మనవరాలు ఏకంగా 18 తులాల బంగారు ఆభరణాలను అపహరించింది. ఈ ఘటన నేరేడ్‌మెట్ పీఎస్ పరిధిలో జరిగింది.

ప్రియుడితో కలిసి అమ్మమ్మ ఇంటినే కొల్లగొట్టింది..!
Ravi Kiran
|

Updated on: Nov 05, 2020 | 3:46 PM

Share

Telangana Crime News: ప్రియుడితో కలిసి సొంత నాయనమ్మ ఇంటిలోనే మనవరాలు ఏకంగా 18 తులాల బంగారు ఆభరణాలను అపహరించింది. ఈ ఘటన నేరేడ్‌మెట్ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కేశవనగర్‌కు చెందిన డీజే ఆపరేటర్ పర్షా అజయ్‌(21), దమ్మాయిగూడలో నివాసముంటున్న పట్రిసియా(21)లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. క్రమేపీ చెడు అలవాట్లకు బానిసైన అజయ్.. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్ధికంగా ఇబ్బందిపడ్డాడు. ఆ సమయంలోనే పట్రిసియా ఇచ్చిన బంగారు గొలుసు అమ్మేశాడు. అయినా డబ్బులు సరిపోకపోవడంతో పట్రిసియా అమ్మమ్మ ఇంట్లో దొంగతనం చేయడానికి పక్కాగా ప్లాన్ వేశాడు.

ఇందులో భాగంగానే అక్టోబర్ 30న డిఫెన్స్ కాలనీలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి ప్రియురాలిని పంపించాడు. వీరు అనుకున్నట్లుగానే అదే రోజు రాత్రి పట్రిసియా 18 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసి అజయ్‌కు అప్పగించింది. వృద్దురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వృద్దురాలి మనవరాలు పట్రిసియా(21)ని నిందితురాలిగా గుర్తించడమే కాకుండా.. ఆమె తన ప్రియుడితో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేల్చారు.

Also Read: ఏపీ బాటలో తెలంగాణ.. ఇకపై పాఠశాలల్లో అడ్మిషన్లకు నో ‘టీసీ’.!

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..