ఏపీ బాటలో తెలంగాణ.. ఇకపై పాఠశాలల్లో అడ్మిషన్లకు నో ‘టీసీ’.!

ఏపీ ప్రభుత్వం బాటలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రైవేట్ స్కూల్స్ దోపిడిని అడ్డుకట్టు వేసేలా ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో

ఏపీ బాటలో తెలంగాణ.. ఇకపై పాఠశాలల్లో అడ్మిషన్లకు నో 'టీసీ'.!
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 05, 2020 | 3:42 PM

Telangana: ఏపీ ప్రభుత్వం బాటలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రైవేట్ స్కూల్స్ దోపిడిని అడ్డుకట్టు వేసేలా ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్(టీసీ) లేకుండానే అడ్మిషన్లు పొందే అవకాశాన్ని కల్పించాలని యోచిస్తోంది. ఇప్పటిదాకా సర్కారీ బడులలో ఐదో తరగతి వరకు టీసీ లేకున్నా ప్రవేశాలకు అవకాశం ఉండగా.. ఇకపై దీన్ని పదో తరగతి వరకు ఉండేలా పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామంటూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతోన్న నేపధ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ ప్రతిపాదనలను కూడా రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. త్వరలోనే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం.

Also Read: చిత్తూరులో వైరస్ దడ.. 150 మంది టీచర్లకు కరోనా పాజిటివ్..