భారత్ శాంతిని కోరుకుంటుందిః రాజ్‌నాథ్‌ సింగ్‌

దేశ సరిహద్దులో శాంతిని కాపాడుకోవడానికి అన్ని ఒప్పందాలను గౌరవించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

భారత్ శాంతిని కోరుకుంటుందిః రాజ్‌నాథ్‌ సింగ్‌
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 05, 2020 | 3:24 PM

దేశ సరిహద్దులో శాంతిని కాపాడుకోవడానికి అన్ని ఒప్పందాలను గౌరవించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఎల్‌ఏసీ వెంట చైనాతో సరిహద్దుల్లో ఏడు నెలలుగా నెలకొన్న పరిస్థితులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.. భారతదేశం శాంతిని ఇష్టపడే దేశమని, విభేదాలు వివాదాలుగా మారకూడదని నమ్ముతున్నామన్నారు. డిఫెన్స్‌ కాలేజీ గురువారం నిర్వహించిన వర్చువల్‌ సెమినార్‌లో రాజ్‌నాథ్‌ ప్రసంగించారు. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని కృతనిశ్చయంతో ఉందని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రాముఖ్యత ఇస్తామన్నారు.

భారత్‌ – చైనా మధ్య ఈ ఏడాది మేలో సరిహద్దు వివాదం రాజుకుంది. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సమస్యను పరిష్కరించేందుకు ఇరుపక్షాలు దౌత్య, సైనిక చర్చలు జరిపినా, ఎలాంటి పురోగతి సాధించలేదు. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ఎనిమిదో రౌండ్‌ కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు శుక్రవారం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలు కాస్త ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఈ సందర్బంగా రాజ్‌నాథ్‌ సింగ్‌.. దేశ సైనిక పరాక్రమం, దేశీయ రక్షణ ఉత్పత్తిని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. యుద్ధాన్ని అరికట్టే సామర్థ్యం ద్వారా మాత్రమే శాంతిని నిర్ధారించవచ్చని, సామర్థ్యాల అభివృద్ధి, స్వదేశీకరణ ద్వారా నిరోధాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.