టీవీ9 ఎఫెక్ట్: హోటళ్లు, రెస్టారెంట్లపై నిఘా

లాక్ డౌన్ తరువాత తెరుచుకున్న హోటళ్లు, రెస్టారెంట్ల శుభ్రత, కొవిడ్ జాగ్రత్తలపై టీవీ9 కథనానికి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సాగర నగరం విశాఖపట్నం సిరిపురం బార్బీక్యూ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్ లోని శాంపిల్స్ సేకరించారు. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అప్పారావు టీవీ9కు తెలిపారు. అనేక హోటళ్లపై నిఘా పెట్టామన్నారు. నిబంధనలు పాటించని వారిపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్  ప్రకారం చర్యలు […]

టీవీ9 ఎఫెక్ట్: హోటళ్లు, రెస్టారెంట్లపై నిఘా
Follow us

|

Updated on: Nov 05, 2020 | 3:20 PM

లాక్ డౌన్ తరువాత తెరుచుకున్న హోటళ్లు, రెస్టారెంట్ల శుభ్రత, కొవిడ్ జాగ్రత్తలపై టీవీ9 కథనానికి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సాగర నగరం విశాఖపట్నం సిరిపురం బార్బీక్యూ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్ లోని శాంపిల్స్ సేకరించారు. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అప్పారావు టీవీ9కు తెలిపారు. అనేక హోటళ్లపై నిఘా పెట్టామన్నారు. నిబంధనలు పాటించని వారిపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్  ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. హోటళ్ళు, రెస్టారెంట్ల నిర్వాహకులు కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అప్పారావు కోరారు. నిల్వ ఉంచిన ఆహారం తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న ఆయన, ఆహారం ఆర్డర్ చేసే ముందు నిర్వాహకులకు సూచనలివ్వాలని తెలిపారు. కాస్త సమయం పట్టినా తాజా ఆహారం మాత్రమే ప్రిఫర్ చేయాలని సూచించారు.