Hyderabadi Biryani: 60 రూపాయలకే తిన్నంత బిర్యానీ.. ఎక్కడో తెలిస్తే మీరు కూడా వెళ్తారు..!

Hyderabadi Biryani: బిర్యానీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది హైదరాబాద్‌ బిర్యానీ. ఈ బిర్యానీ అంటే ప్రతి ఒక్కరు కూడా లొట్టలేసుకుంటారు. ఇక యువకులు వారంతపు...

Hyderabadi Biryani: 60 రూపాయలకే తిన్నంత బిర్యానీ.. ఎక్కడో తెలిస్తే మీరు కూడా వెళ్తారు..!
hyderabad biryani
Follow us
Subhash Goud

|

Updated on: Feb 28, 2021 | 6:04 PM

Hyderabadi Biryani: ఆలోచన ఉంటే..ఆచరణ సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు. లాభాలతో కాకుండా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఆలోచించి పెట్టిన బిర్యానీ పాయింట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే బిర్యానీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది హైదరాబాద్‌ బిర్యానీ. ఈ బిర్యానీ అంటే ప్రతి ఒక్కరు కూడా లొట్టలేసుకుంటారు. ఇక యువకులు వారంతపు సెలవు వచ్చిందంటే చాలు ఎంతదూరమైన సరదాగా వెళ్లీ బిర్యానీ లాగించేస్తారు. ఎంత ధర అయిన హైదరాబాద్‌ బిర్యానీ అంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరి ఇష్టమే. నగరంలో బిర్యానీ సెంటర్లలో ఎక్కడ చూసినా జనాలు భారీగా ఉంటుంటారు. హైదరాబాద్‌ నగరంలో బిర్యానీ సెంటర్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ నగరానికి వచ్చిన వారు తప్పకుండా బిర్యానీ తినే వెళ్తారు.

కానీ హైదరాబాద్‌లో ఇప్పుడు వేడివేడి బిర్యానీ కేవలం రూ.60లకే లభిస్తుంది. అది ఎక్కడో కాదు నగరంలోని ఉప్పల్‌ చౌరస్తా నుంచి రామాంతపురం వెళ్లేరోడ్డులో. ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్‌లో రుచికరమైన బిర్యానీ లభిస్తుంది. ఉదయ్‌, కిరణ్‌ ఇద్దరు అన్నదమ్ములు కలిసి స్టార్టప్‌గా ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్‌ను ప్రారంభించారు. బిర్యానీతో పాటు అదనంగా గ్రేవీ, సలాడ్‌, పెరుగు, స్వీట్‌, మినరల్‌ వాటర్‌ అందజేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా శాకాహారంతో కూడిన బిర్యానీ. తిన్నంత బిర్యానీ పెడుతున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఇటీవలే బిర్యానీ సెంటర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ జనాల్లో మాత్రం మంచి ఆదరణ లభిస్తుందని వారు చెబుతున్నారు. ఇక తక్కువ ధర ఉంది కదా .. బిర్యానీ నాసిరకం ఉంటుందని అనుకోవద్దని, బాస్మతి బియ్యాన్ని వినియోగిస్తున్నట్లు వారు తెలిపారు.

రోజుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు పెట్టుబడి

కాగా, ఇందుకు రోజుకు 1000 నుంచి 1500 రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్నామని బిర్యానీ సెంటర్‌ నడుపుతున్న నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే తక్కువ ధరకే బిర్యానీ అందించినా.. నాణ్యతతో కూడిన బిర్యానీ ఉంటుంనది పేర్కొంటున్నారు. రుచిలో ఎలాంటి ఏడా ఉండదని, ఇప్పటికే బిర్యానీ ప్రియుల నుంచి మంచి స్పందన వస్తోందని చెబుతున్నారు. ప్రతి రోజు ఎంతో రద్దీగా ఉండే ఉప్పల్‌ చౌరస్తా- రామంతపూర్‌ రహదారిలో రూ.60 చెల్లించి తిన్నంత బిర్యానీ తింటున్నామని బిర్యానీ ప్రియులు చెబుతున్నారు.

hyderabad biryani only for rs 60 in uppal chowrasta 1

వెంటాడుతున్న కుటుంబ సమస్యలు

కాగా, ఉదయ్‌, కిరణ్‌ల తండ్రి చనిపోయారు. తల్లి దివ్యాంగురాలు. కుటుంబ భారమంతా వీరిద్దరిపైనే ఉంది. జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిళ్లకు గురయ్యామని, ఈ ఒత్తిడిలో నుంచే బిర్యానీ పాయింట్‌ పెట్టాలనే ఆలోచన వచ్చిందని వారు చెబుతున్నారు. రూ.1.70లక్షలతో ఈ-రిక్షా కొన్నామని, ముందుగా లాభాల గురించి కాకుండా వినియోగదారులను సంతృప్తి పరిచే విధంగా ముందుకెళ్లామని అన్నారు.

ఇవీ చదవండి:

Garlic, Onions: వెల్లుల్లి, ఉల్లిపాయల్లో మొలకలు వస్తే ఏం చేయాలి..? మొలకలు వచ్చినవి తింటే మంచిదేనా..?

Immunity: రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు