పాకిస్తాన్ కు మరో షాక్.. ఈసారి భంగపాటు ఎక్కడంటే..?

కశ్మీర్ విభజన నిర్ణయం జరిగినప్పట్నించి ఇండియాపై విషం చిమ్ముతున్న దాయాది దేశం పాకిస్తాన్ కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఈసారి ఏకంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోనే పాకిస్తాన్ ఖంగుతిన్నది. కశ్మీర్ ను అంతర్జాతీయ సమస్యగా చేయాలని ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ కు ఇది అతిపెద్ద విఘాతంగా చెప్పుకోవచ్చు. ఐరాస భద్రతామండలిలో కశ్మీర్ పై తీర్మానం చేయించాలని తెగ ప్రయత్నించిన పాకిస్తాన్.. దాని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండలి తాజాగా చేసిన ప్రకటనతో ఖంగుతిన్నారు. కశ్మీర్ పై తీర్మానం కాదు కదా.. […]

పాకిస్తాన్ కు మరో షాక్.. ఈసారి భంగపాటు ఎక్కడంటే..?
Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Oct 02, 2019 | 5:32 PM

కశ్మీర్ విభజన నిర్ణయం జరిగినప్పట్నించి ఇండియాపై విషం చిమ్ముతున్న దాయాది దేశం పాకిస్తాన్ కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఈసారి ఏకంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోనే పాకిస్తాన్ ఖంగుతిన్నది. కశ్మీర్ ను అంతర్జాతీయ సమస్యగా చేయాలని ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ కు ఇది అతిపెద్ద విఘాతంగా చెప్పుకోవచ్చు. ఐరాస భద్రతామండలిలో కశ్మీర్ పై తీర్మానం చేయించాలని తెగ ప్రయత్నించిన పాకిస్తాన్.. దాని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండలి తాజాగా చేసిన ప్రకటనతో ఖంగుతిన్నారు. కశ్మీర్ పై తీర్మానం కాదు కదా.. కనీసం జాయింట్ స్టేట్ మెంట్ ఇచ్చేందుకు కూడా భద్రతా మండలి ప్రెసిడెంట్ జెర్రీ మాథ్యూస్ మట్జిలా ససేమిరా అనడంతో పాక్ ప్రతినిధులు అవాక్కయ్యారు.
ఆగస్టులో జరిగిన భద్రతామండలి రహస్య సదస్సులో చైనా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో యధాతథ స్థితిని కొనసాగించేలా ఇండియాను ఆదేశించాలని పాక్ ప్రేరేపణతో చైనా భద్రతామండలిలో ప్రయత్నించింది. చైనా ప్రయత్నాల నేపథ్యంలో ఇండియాకు వ్యతిరేకంగా ఏదైనా ప్రకటన రావచ్చని అంతా అనుకున్నారు. కానీ.. తాజాగా విదేశాంగ శాఖా మంత్రి జయశంకర్ దౌత్య వ్యూహం ఫలితంగా పాక్ కు షాకిచ్చేలా ప్రకటన వచ్చింది. సిమ్లా అగ్రిమెంట్ ఆధారంగా సమస్యను పరిష్కరించుకోవాలని భద్రతామండలి భావిస్తోంది. మండలిలోని 15 దేశాల ప్రతినిధుల్లో మెజారిటీ సభ్యులు కశ్మీర్ లో సాధారణ పరిస్థితులను తీసుకువచ్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను గుర్తించడం భారత్ కు పెద్ద విజయంగా భావిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu