బాబోయ్ ఇది మామూలు విషయం కాదండోయ్… భారత్ స్వర్ణ సంపద తెలిస్తే నివ్వేరపోవాల్సిందే..!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం నిల్వలను కలిగి ఉన్న దేశాల్లో ఒకటిగా అవతరించిందని అసోచామ్ నివేదిక పేర్కొంది. భారతీయ గృహాల్లో, దేవాలయాల్లో ఉన్న బంగారం విలువ సుమారు ట్రిలియన్ల డాలర్లలో ఉంటుందని అంచనా. ఈ అపారమైన స్వర్ణ సంపదను సరైన పద్ధతిలో వినియోగంలోకి తీసుకురావడం వల్ల దిగుమతులపై భారం తగ్గుతుందని, రూపాయి విలువ బలపడుతుందని దేశ ఆర్థిక భవిష్యత్తుపై కీలకమైన అంచనాలను వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. అయితే, రాబోయే దశాబ్దాల్లో భారత్ 40 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకోవడంలో దేశంలోని బంగారు నిల్వలు కీలక పాత్ర పోషించనున్నాయని ఒక తాజా నివేదిక వెల్లడించింది. భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం నిల్వలను కలిగి ఉన్న దేశాల్లో ఒకటిగా అవతరించిందని అసోచామ్ నివేదిక పేర్కొంది. భారతీయ గృహాల్లో, దేవాలయాల్లో ఉన్న బంగారం విలువ సుమారు ట్రిలియన్ల డాలర్లలో ఉంటుందని అంచనా. ఈ అపారమైన స్వర్ణ సంపదను ఆర్థిక వ్యవస్థలోకి సరిగ్గా మళ్లించగలిగితే, భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (40 Trillion Dollar Economy) కల సులభంగా సాకారమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచంలోనే అగ్రస్థానం: భారతదేశంలో కేవలం ప్రభుత్వ నిల్వలే కాకుండా, గృహాలు, ఆధ్యాత్మిక సంస్థల (దేవాలయాల) వద్ద ఉన్న బంగారం అపారంగా ఉంది. ప్రపంచంలో మరే దేశంలోనూ ప్రజల వద్ద ఇంత పెద్ద మొత్తంలో బంగారం లేదని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
ఆర్థిక శక్తిగా బంగారం: భారతీయుల వద్ద ఉన్న ఈ బంగారాన్ని ఒక డెడ్ అసెట్ (ఉపయోగం లేని ఆస్తి)గా కాకుండా, చురుకైన ఆర్థిక వనరుగా మార్చడం ద్వారా దేశ జీడీపీని భారీగా పెంచవచ్చు. దీనికోసం బ్యాంకుల ద్వారా గోల్డ్ లోన్లు, డిజిటల్ గోల్డ్ పథకాలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
దిగుమతుల నియంత్రణ: భారత్ ప్రతి సంవత్సరం వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతోంది. దేశీయంగా ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ చేయడం, వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఈ దిగుమతులను తగ్గించవచ్చు.
మౌలిక సదుపాయాల కల్పన: ఈ స్వర్ణ నిధుల సహాయంతో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చవచ్చని, తద్వారా 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని తాజా నివేదిక అంచనా వేస్తోంది.
భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారాన్ని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా, దేశ ఆర్థికాభివృద్ధికి ఇంధనంగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గోల్డ్ బాండ్లు, ఇతర పథకాలు ఈ దిశగా సానుకూల ఫలితాలను ఇస్తాయని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




