అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుదారులకు ఊరట

|

Sep 06, 2020 | 5:52 PM

అగ్రిగోల్డ్‌ ఆస్తుల వ్యవహారంతో ముడిపెడుతూ ఆ కంపెనీ నుంచి గతంలో ఆస్తులు కొనుగోలు చేసిన పలువురికి అద్దె చెల్లించాలంటూ సీఐడీ ఇచ్చిన నోటీసులను ఉన్న‌త న్యాయ‌స్థానం రద్దు చేసింది.

అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుదారులకు ఊరట
Follow us on

అగ్రిగోల్డ్‌ ఆస్తుల వ్యవహారంతో ముడిపెడుతూ ఆ కంపెనీ నుంచి గతంలో ఆస్తులు కొనుగోలు చేసిన పలువురికి అద్దె చెల్లించాలంటూ సీఐడీ ఇచ్చిన నోటీసులను ఉన్న‌త న్యాయ‌స్థానం రద్దు చేసింది. ఆ తరహా తాఖీదుల జారీ చట్ట విరుద్ధమని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆస్తిని జప్తు చేయడమంటే దానిని ఇతరులకు విక్రయించకుండా, తాక‌ట్టు పెట్టకుండా నిలువరించడానికేగానీ వాటిపై అద్దె వసూలు చేయడానికి కాదని పేర్కొంది.

అగ్రిగోల్డ్ స్కామ్‌కి ముందెప్పుడో కొనుగోలు చేసిన ఫ్లాట్లకు అద్దెను జమ చేయాలని కోరుతూ సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఫార్చూన్‌ హేలాపురి అపార్ట్‌మెంట్ ఓన‌ర్స్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ పాత‌ డైరెక్టర్లు కూడా కొన్ని పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలను విచారించిన ధ‌ర్మాస‌నం.. ఈ ఏడాది జూన్‌లో జారీ చేసిన నోటీసులను రద్దు చేసింది.

 

Also Read :

క‌రోనా సోకింద‌ని అమ్మ‌ను పొలం వ‌ద్ద వ‌దిలేశారు

కారుణ్య ఉద్యోగం కోసం క‌న్న తండ్రినే చంపేశారు