AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు..

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Breaking: మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు..
Ravi Kiran
|

Updated on: Aug 28, 2020 | 12:53 PM

Share

Acchannaidu Bail Granted: టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికీ వెళ్ళకూడదని.. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని న్యాయస్థానం సూచించింది. ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన అచ్చెన్నాయుడు.. 70 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు. కాగా, అచ్చెన్నాయుడు ప్రస్తుతం కరోనాతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక బెయిల్ కోసం అచ్చెన్నాయుడు గతంలో రెండుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమవడం తెలిసిన విషయమే.(కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)

Follow Us