20వేల కొవిఫర్(రెమ్‌డెసివిర్) ఇంజక్షన్లు సిద్ధం: హెటెరో
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సరఫరా చేయడానికి 20వేల కొవిఫర్(రెమ్‌డెసివిర్) ఇంజెక్షన్లను సిద్ధం చేస్తున్నామని

Hetero Healthcare: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సరఫరా చేయడానికి 20వేల కొవిఫర్(రెమ్‌డెసివిర్) ఇంజెక్షన్లను సిద్ధం చేస్తున్నామని హెటెరో హెల్త్‌కేర్ బుధవారం ప్రకటించింది. 100మిల్లీగ్రాముల ఇంజెక్షన్‌ను రూ.5,400కు అందిస్తున్నామని పేర్కొంది. మొదటి విడతలో అత్యవసరంగా 10వేల ఇంజెక్షన్లను హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ముంబైలకు పంపిస్తున్నామని పేర్కొంది.
మరోవైపు.. వారంలోపు మిగతా 10వేల ఇంజెక్షన్లను సరఫరా చేస్తామని హెటెరో తెలిపింది. రెండో విడత సరఫరా జాబితాలో విజయవాడ ఉంది. కాగా, తమ రెమ్‌డెసివిర్ జెనెరిక్ ఇంజెక్షన్ ధర రూ.5 వేలలోపు ఉంటుందని, 10రోజుల్లోపు భారత్‌లో అవి అందుబాటులోకి వస్తాయని సిప్లా పేర్కొంది.
Also Read: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అగ్ని ప్రమాదం