హీరోయిన్ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..
హీరోయిన్ నమితకు చేదు అనుభవం ఎదురైంది. పబ్లిక్‌గా పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై స్పందించిన నమిత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ..
హీరోయిన్ నమితకు చేదు అనుభవం ఎదురైంది. పబ్లిక్‌గా పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై స్పందించిన నమిత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. నమితకు ఉండే క్రేజే వేరు. తన అందం, హాట్ లుక్స్‌తో తమిళంలోనే కాకుండా.. సౌత్‌లో కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కెరీర్ మొదటిలో హీరోయిన్ రోల్స్ చేసినప్పటికీ.. ఆ తర్వాత ప్రత్యేకమైన పాత్రలకే పరిమితమైంది. సౌత్‌లో సొంతం, జెమినీ సినిమాల్లో నటించిన ఈ భామ.. ఆ తర్వాత బిల్లా, సింహా సినిమాల్లో కనిపించింది. పెళ్లి తర్వాత సినీ ప్రపంచానికి దూరమైన నమిత.. ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది.
కాగా ఇప్పుడు నమిత చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఓ నెటిజన్.. తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని ట్వీట్ చేసింది. అలాగే అతని ఫొటోను కూడా సోషల్ మీడియాలో బయటపెట్టింది. ‘సెంతమిల్ స్మిత్ అనే పేరుతో ఉన్న ఇతడు.. నమితతో చాటింగ్ మొదలు పెట్టాడు. ఈ మెసేజ్‌కి నేను కూడా రిప్లై ఇచ్చా. అయితే ఆ తర్వాత హాయ్ ఐటమ్ అని అతను మెసేజ్ పెట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన నమిత.. వాదనకు దిగింది. దీంతో అతను నా ట్విట్టర్ హ్యాక్ అయిందని చెప్పాడు. ఆ కహానీలు నేను నమ్మలేదు. కథ అడ్డం తిరగడంతో నన్నే బెదిరించడానికి ప్రయత్నించాడంటూ తెలిపింది.
అంతేకాకుండా నా దగ్గర నీ పోర్న్ వీడియోలున్నాయి. వాటిని బయటపెడతా అంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. వాటి గురించి నాకు తెలుసు కాబట్టి.. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్పా. ఇలాంటి వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలి. అందుకే ఇతని ఫొటో ఎక్స్‌పోజ్ చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది నమిత.
Don’t judge the book by the cover ! Thats a general mistake we all do. Learn to respect #women, all shapes, sizes or from which ever path they come from. Because at the End, Love and Respect is all that we can generally give and take pic.twitter.com/tLFtTYNjx7
— Namitha – Official Fanpage (@WeLuvNamitha) March 17, 2020
Read More this also: దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం! ఇకపై ఆ కామెంట్స్
ఇంటింటికి ఉచితంగా కిలో చికెన్ సప్లై.. గారెలతో కలిపి
దారుణంగా పడిపోయిన టమాటా ధరలు.. పదికి 3 కిలోలు