ఏ టైమ్‌లో పుట్టావమ్మా.. నీ జాతకానికి నమస్కారం: సమంతపై ఛార్మీ ట్వీట్

వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత పై నటి ఛార్మి పొగడ్తల వర్షం కురిపించారు. ఓ బేబి సినిమా మంచి టాక్ అందుకున్న నేపథ్యంలో ఛార్మి ట్వీట్ చేశారు. ఏ టైమ్ లో పుట్టావమ్మా నువ్వు.. నీ శ్రమ, నీ నిర్ణయాలు, నీ జాతకానికి నమస్కారం.. నందిని రెడ్డి, మిగిలిన చిత్ర బృందం పట్ల చాలా సంతోషంగా ఉంది అంటూ సామ్ రాక్స్, ఓ బేబి రాక్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను పెట్టి ఛార్మి పోస్టు చేసింది. ఇక ఈ […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:15 pm, Sat, 6 July 19
ఏ టైమ్‌లో పుట్టావమ్మా.. నీ జాతకానికి నమస్కారం: సమంతపై ఛార్మీ ట్వీట్

వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత పై నటి ఛార్మి పొగడ్తల వర్షం కురిపించారు. ఓ బేబి సినిమా మంచి టాక్ అందుకున్న నేపథ్యంలో ఛార్మి ట్వీట్ చేశారు. ఏ టైమ్ లో పుట్టావమ్మా నువ్వు.. నీ శ్రమ, నీ నిర్ణయాలు, నీ జాతకానికి నమస్కారం.. నందిని రెడ్డి, మిగిలిన చిత్ర బృందం పట్ల చాలా సంతోషంగా ఉంది అంటూ సామ్ రాక్స్, ఓ బేబి రాక్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను పెట్టి ఛార్మి పోస్టు చేసింది. ఇక ఈ పోస్టుకు సామ్ రిప్లై కూడా ఇచ్చింది. నువ్వు ఎంతో క్యూటెస్ట్ ధన్యవాదాలు ఛార్మీ. నీకు నా ఆత్మీయ కౌగిలి , ముద్దుల్ని పంపుతున్నా అని ట్వీట్ చేశారు. దీని ఛార్మీ నవ్వుతూ ఎమోజీలను పోస్టు చేశారు.

మరోవైపు ఓ బేబీ మూవీ ప్రమోషన్స్ మొత్తాన్ని తానే చూసుకుంటూ.. ముందెన్నడూ లేనంత విపరీతమైన ప్రచారాన్ని తీసుకువచ్చారు. ఈ చిత్రానికి అమెరికాలో ప్రీమియర్ షోలు నిర్వహించడంతో ట్విట్టర్ లో నెటిజెన్ల నుంచి మంచి స్పందనలు వస్తున్నాయి. సమంత కెరియర్‌లోనే ఇది ది బెస్ట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.