AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండ తీవ్రతను తట్టుకోలేక హీరో జాన్‌ అబ్రహాం ఏం చేశాడంటే..!

2016 సంవత్సరంలో విడుదలైన హిందీ చిత్రం ‘ఢిషూం’ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఏకంగా బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం రిలీజ్అయ్యి బుధవారానికి నాలుగేళ్లయిన సందర్భంగా సినిమా హీరోల్లో ఒకరైన వరుణ్‌ ధావన్‌ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని షేర్ చేశారు.

ఎండ తీవ్రతను తట్టుకోలేక హీరో జాన్‌ అబ్రహాం ఏం చేశాడంటే..!
Balaraju Goud
|

Updated on: Jul 31, 2020 | 12:37 AM

Share

2016 సంవత్సరంలో విడుదలైన హిందీ చిత్రం ‘ఢిషూం’ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఏకంగా బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం రిలీజ్అయ్యి బుధవారానికి నాలుగేళ్లయిన సందర్భంగా సినిమా హీరోల్లో ఒకరైన వరుణ్‌ ధావన్‌ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని షేర్ చేశారు. అంతేకాకుండా ఈ చిత్రం షూటింగ్‌ సందర్భంగా జరిగిన ఓ నమ్మలేని సంఘటనను కూడా అతను బయటపెట్టాడు. ఈ సినిమాలో కొంత భాగాన్ని అబుదబీలోని ఎడారిలో చిత్రీకరించాట. అయితే, అక్కడి ఎండల తీవ్రతను తట్టుకోలేక మరో హీరో జాన్‌ అబ్రహాం పుచ్చకాయలను ఎక్కువగా తీసుకున్నాడట. అది కూడా ఒకటో, రెండో కాదట.. జాన్‌ ఒక్క రోజులో మొత్తం 21 పుచ్చకాయలను ఆరగించేశాడని వరుణ్‌ గుర్తుచేసుకున్నాడు.

జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ కథానాయికగా రూ.45 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద రూ.150 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి వరుణ్‌ సోదరుడు రోహిత్‌ ధావన్‌ దర్శకత్వం వహించారు. తను పనిచేసిన అత్యుత్తమ చిత్రాల్లో ఇది ఒకటని, తన ఇద్దరు సోదరులు తనకు ఎప్పుడూ అండగా ఉంటారని జూనియర్‌ ధావన్‌ అన్నాడు. అంతేకాకుండా మరోసారి తమ బృందం ఒకచోట చేరే సమయం రావచ్చని… ఢిషూం సీక్వెల్‌ వచ్చే అవకాశాన్ని వరుణ్‌ ధావన్‌ సూచనప్రాయంగా తెలిపారు

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్