టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘సోలో బ్రతుకే బెటర్’. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఓ సాంగ్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కరోనా అడ్డు రాకుండా ఉంటే.. ఈపాటికే మూవీ రిలీజ్ కావాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇందుకు ఓ ప్రముఖ ఓటీటీతో నిర్మాణ సంస్థ ఇటీవల ఈ చిత్ర యూనిట్‌తో చర్చలు జరిపిందని తెలుస్తోంది. అక్టోబరులో ఈ సినిమాను ఓటీటీ యాప్ ద్వారా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. కాగా ఈ మూవీ రొమాంటిక్, కామెడీ కథాంశంతో తెరకెక్కుతోంది. ఇందులో రావు రమేష్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నారు. అలాగే సుబ్బు అనే కొత్త డైరెక్టర్ పరిశ్రమకు పరిచయమవుతున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది.
Read More:
గ్రాండ్‌గా నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్యల ఎంగేజ్‌మెంట్
ఇకపై వాట్సాప్‌లోనే బోర్డింగ్ పాస్! ఎలాగంటే?
కోమాలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీః ఆర్మీ రీసెర్చ్ హాస్పిటల్