రెండో టెస్ట్: కష్టాల్లో పాకిస్థాన్.. జోరు మీద ఇంగ్లాండ్

సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ 150 పరుగుల లోపే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొదటి టెస్టులో అదరగొట్టిన షాన్ మసూద్ ఒక్క పరుగుకు పెవిలియన్ చేరగా..

రెండో టెస్ట్: కష్టాల్లో పాకిస్థాన్.. జోరు మీద ఇంగ్లాండ్
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 13, 2020 | 10:32 PM

ENG Vs PAK: సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ 150 పరుగుల లోపే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొదటి టెస్టులో అదరగొట్టిన షాన్ మసూద్ ఒక్క పరుగుకు పెవిలియన్ చేరగా.. కెప్టెన్ అజహర్ అలీ 20 పరుగుల స్కోర్ మాత్రమే చేయగలిగాడు. ఓపెనర్ అబిద్ అలీ ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం పాకిస్థాన్ 126 పరుగులకు 5 వికెట్లు కోల్పోగా.. క్రీజులో బాబర్ ఆజామ్, రిజ్వాన్ ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ రెండు కీలక వికెట్లు పడగొట్టగా. బ్రాడ్, కర్రన్, వోక్స్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్.. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేకుండానే బరిలోకి దిగింది.

Also Read:

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..