టాలీవుడ్‌లో రీమేక్‌ల జోరు… ఎవరు మెప్పిస్తారో.?

టాలీవుడ్‌కు కథలు కరువయ్యాయో.. లేక పరభాషా సినిమాల మీద మన హీరోలకు మక్కువ ఎక్కువైందో గానీ.. వచ్చే ఆరు నెలల్లో కనీసం అరడజన్ పైగా రీమేక్ సినిమాలు తెలుగులో సందడి చేయనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి యంగ్ హీరో నితిన్ వరకు వివిధ భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాల రీమేక్‌ల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆ భాషలో ఆయా చిత్రాలు హిట్ అయినా.. తెలుగులో ఎంతవరకూ మెప్పిస్తాయో వేచి చూడాలి. అయితే ఒకసారి ఆ […]

టాలీవుడ్‌లో రీమేక్‌ల జోరు... ఎవరు మెప్పిస్తారో.?
Follow us

|

Updated on: Nov 13, 2019 | 10:22 AM

టాలీవుడ్‌కు కథలు కరువయ్యాయో.. లేక పరభాషా సినిమాల మీద మన హీరోలకు మక్కువ ఎక్కువైందో గానీ.. వచ్చే ఆరు నెలల్లో కనీసం అరడజన్ పైగా రీమేక్ సినిమాలు తెలుగులో సందడి చేయనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి యంగ్ హీరో నితిన్ వరకు వివిధ భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాల రీమేక్‌ల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆ భాషలో ఆయా చిత్రాలు హిట్ అయినా.. తెలుగులో ఎంతవరకూ మెప్పిస్తాయో వేచి చూడాలి. అయితే ఒకసారి ఆ రీమేక్ మూవీస్‌ను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి..

1.లూసిఫర్:

మలయాళ సూపర్‌‌స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లూసిఫర్’. పక్కా పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మలయాళంలో పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందించనున్నారు. ఇప్పటికే హీరో రామ్ చరణ్ ఈ చిత్రం హక్కులను దక్కించుకున్నాడు. కొరటాల శివతో సినిమా పూర్తి అయిన వెంటనే లూసిఫర్ రీమేక్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

2.పింక్:

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పింక్’ చిత్రం అద్భుత విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా ‘నేర్కొండ పావై’ పేరుతో ప్రముఖ నిర్మాత బోణి కపూర్ నిర్మించాడు. అక్కడ కూడా ఈ మూవీ ఘన విజయాన్ని అందుకుంది.

ఇక తెలుగులో రీమేక్ కాబోతున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తిరిగి సినిమాల్లోకి  రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నాడట. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటిస్తాడో లేదో అనేది సస్పెన్స్ గానీ.. ఒకవేళ అది గనక నిజమైతే.. మెగా ఫ్యాన్స్‌కు ఈ సినిమా విజువల్ ట్రీట్ అని చెప్పాలి.

3.అసురన్:

ధనుష్ హీరోగా దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన చిత్రం ‘అసురన్’. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. వెట్రిమారన్ టేకింగ్‌కు… ధనుష్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కల్ట్ క్లాసిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పాలి.

ఇక ఈ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కించనున్నారు. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో శ్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

4.తాదం:

అర్జున్ విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘తాదం’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు మాగి తిరుమేని దర్శకుడు. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు రీమేక్‌ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కనుంది. దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో రూపొందనున్న ఈ సినిమాలో మాళవిక శర్మ, నివేధా పేతురాజ్ హీరోయిన్లుగా నటించనున్నారు. డిసెంబర్ నుంచి ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.

5.96 రీమేక్:

విజయ్ సేతుపతి, త్రిష జంటగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ’96’. ఈ సినిమా అద్భుత విజయం సాధించడమే కాకుండా విజయ్ సేతుపతి కెరీర్‌లోనే స్పెషల్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ రీమేక్‌ను తెలుగులో శర్వానంద్, సమంతా ప్రధాన పాత్రల్లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ మూవీ వాలంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

6.అంధాదున్:

ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అంధాదున్’. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం అద్భుత విజయం అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో రీమేక్ కానుంది. యంగ్ హీరో నితిన్ ఇందులో మెయిన్ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..