Tax Harvesting: ఇలా చేస్తే రూ. 10వేల వరకూ ట్యాక్స్ ఆదా! పూర్తి వివరాలు తెలుసుకోండి..

పన్ను హార్వెస్టింగ్ ప్రకారం మీరు దీర్ఘకాలానికి షేర్లు కలిగి ఉండరు. నిర్ధిష్ట కాలానికి మాత్రమే హోల్డింగ్ కలిగి ఉంటారు. ఆ తర్వాత షేర్లను విక్రయించాల్సి ఉంటుంది. ఆపై మళ్లీ ఎక్కువ ధరకు షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Tax Harvesting: ఇలా చేస్తే రూ. 10వేల వరకూ ట్యాక్స్ ఆదా! పూర్తి వివరాలు తెలుసుకోండి..
Tax Saving
Follow us

|

Updated on: Mar 17, 2023 | 5:00 PM

ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో పన్నుల దాఖలుకు గడువు కూడా సమీపిస్తోంది. ఇప్పటికీ పన్ను ఆదా చేయడానికి మార్గాలను అన్వేషిస్తున్న పెట్టుబడిదారుల కోసం బెస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది. అదే పన్ను హార్వెస్టింగ్. పన్ను హార్వెస్టింగ్‌ను అర్థం చేసుకోవడానికి, ఈక్విటీకి సంబంధించిన పన్ను నియమాలను తెలుసుకోవడం అవసరం. 2018లో దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీర్ఘకాలిక మూలధన లాభాలను తిరిగి ప్రవేశపెట్టారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష దాటిన ఈక్విటీ పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక లాభంపై 10 శాతం పన్ను విధించబడుతుంది.

పన్ను అవుట్ గోను తగ్గించుకోండి..

ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడిపై రాబడిని పెంచుకోవచ్చు. టెక్నికల్ గా దీనిని ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు. ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రాబడిపై దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను చెల్లించాలి. కానీ ట్యాక్స్ ప్లానింగ్ ఈ భారీ పన్ను ఔట్‌గోను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ట్యాక్స్ హార్వెస్టింగ్ గురించి తెలుసుకునే ముందు మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలి.

లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేయిన్..

మీరు ట్యాక్స్ హార్వెస్టింగ్ విధానం ద్వారా పన్నుల చెల్లింపు తగ్గించుకునే వీలుంటుంది. ముందుగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏమిటో చూద్దాం.. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం హోల్డింగ్ చేసిన తర్వాత షేర్ లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్ ను విక్రయించడం ద్వారా లాభం పొందుతారు. అయితే ఆ లాభాన్ని సాంకేతికంగా దీర్ఘకాలిక మూలధన లాభం ఎల్టీసీజీ అంటారు. దీనిపై ప్రభుత్వ విధించే పన్నును దీర్ఘకాలిక లాభం పన్ను అంటారు. గుర్తుంచుకోండి ఒక సంవత్సరంలో రూ. లక్ష వరకూ వచ్చే లాభంపై మీరు దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ లాభాలపై మాత్రమే మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది పదిశాతం ఉంటుంది. అయితే ట్యాక్స్ హర్వెస్టింగ్ ద్వారా ఈ పన్ను అవుట్ గోను తగ్గించవచ్చు. పన్ను హార్వెస్టింగ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

పన్ను హార్వెస్టింగ్ అంటే ఇది..

పన్ను హార్వెస్టింగ్ ప్రకారం మీరు దీర్ఘకాలానికి షేర్లు కలిగి ఉండరు. కానీ నిర్ధిష్ట కాలానికి మాత్రమే హోల్డింగ్ కలిగి ఉంటారు. ఆ తర్వాత షేర్లను విక్రయించాల్సి ఉంటుంది. ఆపై మళ్లీ ఎక్కువ ధరకు షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు పెట్టుబడులపై పన్ను అవుట్ గోను తగ్గించుకోవచ్చు. దీనిని ఒక ఉదహరణ ద్వారా అర్థం చేసుకుందాం..

మార్చి 2022న మీరు రూ. లక్ష రూపాయల షేర్లు కొనుగోలు చేశారనుకోండి. ఒక్కో షేర్ ధర రూ. 305కాగా మీ మూల ధరం రూ. లక్షతో ఓ కంపెనీకి చెందిన 328 షేర్లు కొనుగోలు చేశారనుకోండి. ఆ షేర్ల ధర మార్చి 2023కి బాగా పెరిగి, ఒక్కో షేర్ ధర 610కి చేరుతాయి. వాటిని మీరు రూ. 610 కి విక్రయిస్తారు. దీని ద్వారా రూ. 1.08లక్షల లాభాన్ని పొందుతారు. మీరు సంపాదించిన లక్షా ఎనభైవేలలో లక్ష వరకూ ట్యాక్ లేదు. కేవలం రూ. 80 రూపాలకు మాత్రమే ఎల్టీసీజీ ట్యాక్స్ 10 శాతం విధిస్తారు. అంటే ఎనిమిది రూపాయలు మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తారు. ఇప్పుడు అదే కంపెనీ షేర్లను మళ్లీ అధిక మొత్తం మూలధనం రూ. 2.80లక్షలతో ఒక్కో షేర్ ను రూ. 610చొప్పున 328 షేర్లను కొనుగోలు చేస్తారు. మళ్లీ ఏడాది గడచిన తర్వాత మార్చి 2024న ఆ షేర్ రేటు మళ్లీ పెరుగుతుంది. ఒక్కో షేర్ ధర రూ. 910 చొప్పున రూ. 3 లక్షల 120 రూపాలయకు చేరుతుంది. దానిని రూ. 3.120 లక్షలకు మళ్లీ షేర్లను విక్రయిస్తారు. అప్పుడు మీకు వచ్చే లాభం ఒక లక్షా 40 రూపాయలు, ఇక్కడ లక్ష వరకూ ట్యాక్స్ లేదు. కేవలం 40 రూపాయలకు మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తారు. అంటే నాలుగు ట్యాక్స్ చెల్లిస్తారు. ఇప్పుడు రెండేళ్లలో ఏడాది ఒకసారి చొప్పున మీరు విక్రయించిన షేర్లకు గానూ మీరు చెల్లించిన మొత్తం పన్ను కేవలం రూ. 12. అదే మీరు రెండేళ్లు పూర్తయిన తర్వాత ఒకేసారి షేర్లు విక్రయిస్తే మీరు దాదాపు రూ. 10,012 పన్ను చెల్లించి ఉండేవారు. అంటే రూ. 10వేలు ఎక్కువన్నమాట.

పరిమితులు ఇవి..

షేర్లలో పెట్టుబడిదారులు మళ్లీ పెట్టుబడి పెట్టేటప్పుడు కొంత రిస్క్ తీసుకోవాలి. పెట్టుబడిదారుడు లాభం మొత్తాన్ని రీడీమ్ చేస్తే, తిరిగి పెట్టుబడి పెట్టేటప్పుడు, మార్కెట్లు అస్థిరంగా ఉంటే కొంత నష్టాన్ని పొందే అవకాశం ఉంది. పోర్ట్‌ఫోలియోను అనవసరంగా సమీక్షించడం, పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోను మళ్లీ మళ్లీ చూడటం అలవాటు చేసుకోవచ్చు, ఇది మార్కెట్లు అస్థిరంగా ఉంటే భయాందోళనలను సృష్టించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..