Fever Phone: ఇక థర్మోమీటర్లకు కాలం చెల్లింది.. మీ ఫోన్ నుంచే ఫీవర్ ఎంతో చూడొచ్చు..

యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు ఫీవర్ ఫోన్ పేరుతో ఓ కొత్త యాప్ ను తయారుచేశారు జ్వరం ఉన్న వ్యక్తికి నుదిటికి కొంత దూరంగా మొబైల్ ను ఉంచి.. కెమెరా సాయంతో టెంపరేచర్ ను తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Fever Phone: ఇక థర్మోమీటర్లకు కాలం చెల్లింది.. మీ ఫోన్ నుంచే ఫీవర్ ఎంతో చూడొచ్చు..
Phone Thermometer

Updated on: Jun 25, 2023 | 5:30 PM

స్మార్ట్ ఫోన్ ప్రపంచ గతిని మార్చిందని చెప్పొచ్చు. అరచేతిలో ఇమిడిపోయిన ఈ టెక్ గ్యాడ్జెట్ మనిషికి అవసరం అయిన ప్రతి పనిని చేసిపెడుతోంది. బ్యాంకింగ్ అవసరాలు, విద్య, ఆరోగ్య పరమైన అన్నింటిని మోనిటరింగ్ చేసేందుకు స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతుంది. రోజుకో కొత్త ఫీచర్ తో సరికొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. అయితే హెల్త్ ఫీచర్ల విషయానికి వస్తే ఎక్కువగా స్మార్ట్ వాచ్ ని వినియోగిస్తున్నారు. హార్ట్ రేట్, స్టెప్ప్ కౌంటింగ్, ఆక్సిజన్ లెవెల్స్ మోనిటరింగ్, వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్లు స్మార్ట్ వాచ్ లలో ఉంటున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ లో కూడా కొన్ని హెల్త్ ఫీచర్లు ఉంటున్నాయి. మీ ఫోన్ ఏకంగా థర్మోమీటర్ గా కూడా మార్చుకునే అవకాశం ఉంది. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక యాప్ ను మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేయడమే. ఆ యాప్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? చూద్దాం రండి..

ఫీవర్ ఫోన్ యాప్..

యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు ఫీవర్ ఫోన్ పేరుతో ఓ కొత్త యాప్ ను తయారుచేశారు. ఫోన్ లో టచ్ స్క్రీన్, బ్యాటరీ టెంపరేచర్ ను కనుకునేందుకు ఉపయోగపడే సెన్సార్ల సాయంతో ఈ యాప్ పనిచేస్తుంది. ఆ సెన్సర్ల సాయంతో బాడీ టెంపరేచర్ ను కొలిచి మెషిన్ లెర్నింగ్ సాయంతో థర్మోమీటర్ లా సాయపడుతుంది. అయితే, ఇందులో ప్రత్యేకంగా ఎలాంటి అదనపు హార్డ్ వేర్ వాడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఈ యాప్ ను ఎలా వాడాలంటే..

జ్వరం ఉన్న వ్యక్తికి నుదిటికి కొంత దూరంగా మొబైల్ ను ఉంచి.. కెమెరా సాయంతో టెంపరేచర్ ను తెలుసుకోవచ్చు. కేవలం 90 సెకన్లలోనే ఈ యాప్ రిజల్ట్ చూపిస్తుంది. ఈ యాప్ టెస్టింగ్ లో భాగంగా 37 మందిపై ప్రయోగించారు. వాళ్లలో 95శాతం కరెక్ట్ రిజల్ట్ చూపించింది. సుమారుగా 0.41 డిగ్రీల ఫారన్ హీట్(.23 డిగ్రీల సల్సీయస్) టెంపరేచర్ మాత్రమే తేడా చూపించింది. క్లినికల్ గా 0.5శాతం వరకూ తేడాను అనుమతిస్తారు.

ఇవి కూడా చదవండి

కొన్ని సమస్యలు..

అయితే పరిశోధకులు యాప్ పరీక్షల సమయంలో కొన్ని లోపాలను గుర్తించారు. వాటని అధిగమించేందుకు ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ యాప్ పరీక్షల్లో అధిక ఫీవర్(ఉష్ణోగ్రత) ఉన్న పేషెంట్లు అంటే 101.5 డిగ్రీల ఫారన్ హీట్ కన్నా ఎక్కువ ఉన్న వారిని ఉద్దేశ పూర్వకంగానే పరీక్షలోకి తీసుకోలేదు. అలాగే చర్మంపై చెమట ఉంటే ఈ యాప్ సక్రమంగా పనిచేయడం లేదు. ఈ ఫీవర్ ఫోన్ యాప్ ని మూడు ప్రత్యేకమైన ఫోన్ మోడళ్లలో మాత్రమే పరీక్షించారు. వీటినికూడా పరిష్కరించి, కావాల్సిన మెడికల్ క్లియరెన్స్ లన్నీ తీసుకున్న తర్వాత మార్కెట్లోకి యాప్ ను విడుదల చేస్తారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..