సెక్యూరిటీ గెటప్‌లో వచ్చారు.. కనిపించిన వారిని కాల్చేశారు.. స్పాట్‌లోనే..
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో పట్టపగలే కాల్పులు కలకలం రేపాయి. ప్రముఖ పర్యాటక కేంద్రం బాండి బీచ్‌లోకి చొరబడిన కొందరు దుండగులు పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనతో బాండి బీచ్ పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో పట్టపగలే కాల్పులు కలకలం రేపాయి. ప్రముఖ పర్యాటక కేంద్రం బాండి బీచ్‌లోకి చొరబడిన కొందరు దుండగులు పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనతో బాండి బీచ్ పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం కావడంతో బాండి బీచ్‌లో పర్యాటకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో సేదదీరుతున్నారు. ఈ సమయంలో ఊహించని విధంగా ఇద్దరు గన్‌మెన్లు బీచ్‌లోకి ప్రవేశించి కాల్పులు ప్రారంభించారు. ఒక్కసారిగా తూటాల శబ్దాలు వినిపించడంతో వందలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడి వాతావరణం క్షణాల్లోనే భయానకంగా మారింది.
నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు షాట్‌గన్స్‌తో సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకొని కాల్పులు జరిపారు. అక్కడ జరుగుతున్న ఒక ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ దాడిలో క్షతగాత్రులను కాపాడేందుకు హెలికాప్టర్లు, 30 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకొన్నాయి.
బీచ్‌లోకి చొరబడిన దుండగులు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న వేళ ఓ స్థానికుడు వారిని అడ్డుకున్నాడు. ఓ సాయుధుడిని వెనుక నుంచి వెళ్లి బలంగా పట్టుకొని అతడి చేతిలో గన్‌ను లాగేసుకొన్నాడు. ఆ తర్వాత చేతికందిన వాటితో అతడిని తరిమికొట్టాడు. దీంతో అతడితో ఉన్న మరో దుండగుడు కూడా వెనక్కి తగ్గాడు.
బాండి బీచ్‌లో యూదులు జరుపుకొంటున్న హనుక్కా వేడుకలను దుండగులు లక్ష్యంగా చేసుకొన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
