టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లు ఇవే..!
87 సంవత్సరాల తెలుగు సినీ పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్‌తో పాటుగా అట్టర్ ప్లాప్స్, డిజాస్టర్లు ప్రతి హీరో కెరీర్‌లో ఉన్నాయి. అంతేకాక కొన్ని సినిమాలు అటు డిస్టిబ్యూటర్లకు, ఫైనాన్షియర్లకు భారీ నష్టాలు కూడా తెచ్చిపెట్టాయి. ఇక ఈ మధ్యకాలంలో ప్రతి నిర్మాత తమ సినిమాను దాదాపు భారీ బడ్జెట్‌తోనే నిర్మిస్తున్నారు. దీనితో ఆ చిత్రం నెగటివ్ టాక్ తెచ్చుకుంటే అదే స్థాయిలో నష్టాలు వాటిల్లుతున్నాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ నష్టాలు తెచ్చిపెట్టిన […]

87 సంవత్సరాల తెలుగు సినీ పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్‌తో పాటుగా అట్టర్ ప్లాప్స్, డిజాస్టర్లు ప్రతి హీరో కెరీర్‌లో ఉన్నాయి. అంతేకాక కొన్ని సినిమాలు అటు డిస్టిబ్యూటర్లకు, ఫైనాన్షియర్లకు భారీ నష్టాలు కూడా తెచ్చిపెట్టాయి. ఇక ఈ మధ్యకాలంలో ప్రతి నిర్మాత తమ సినిమాను దాదాపు భారీ బడ్జెట్‌తోనే నిర్మిస్తున్నారు. దీనితో ఆ చిత్రం నెగటివ్ టాక్ తెచ్చుకుంటే అదే స్థాయిలో నష్టాలు వాటిల్లుతున్నాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలు సాహో, అజ్ఞాతవాసి, స్పైడర్, ఎన్టీఆర్ బయోపిక్, బ్రహ్మోత్సవం.
సాహో:
‘బాహుబలి 1&2’ సినిమాలతో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ సిరీస్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రం ‘సాహో’. విడుదలకు ముందే దాదాపు 300 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 222 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రం రాబట్టగలిగింది. కథ, కథనంలో కొత్తదనం లేకపోయినా.. ప్రభాస్ క్రేజ్‌తోనే ఈ భారీ వసూళ్లు వచ్చాయని చెప్పొచ్చు. అన్ని భాషల్లోనూ ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 78 కోట్లు నష్టపోయారు.
అజ్ఞాతవాసి:
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం 123 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 60 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. సినిమా కొన్న ఫైనాన్షియర్లకు 63 కోట్ల రూపాయల నష్టం వచ్చింది.
స్పైడర్:
మహేష్ బాబు హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘స్పైడర్’. ఈ సినిమా తెలుగు, తమిళంలో కలిపి 120 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. కాగా, ఈ సినిమాకి రెండు భాషల్లో 62 కోట్ల షేర్ రాగా.. డిస్టిబ్యూటర్లకు 58 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను సైతం నిరాశ పరిచింది.
ఎన్టీఆర్ బయోపిక్:
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. రెండు భాగాలుగా రూపొందించిన ఈ చిత్రం 72 కోట్ల రూపాయల ప్రీ- రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే విడుదలైన తర్వాత ఈ సినిమా రెండు భాగాలు కేవలం 20 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగా.. 52 కోట్లు నష్టం వచ్చింది.
బ్రహ్మోత్సవం:



