వాతావరణ హెచ్చరిక.. తెలంగాణలో మరో రెండు భారీ వర్షాలు!

|

Sep 26, 2020 | 8:28 PM

Rain Alert In Telangana: రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణితో పాటు తూర్పు బీహార్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ఈ రోజు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, […]

వాతావరణ హెచ్చరిక.. తెలంగాణలో మరో రెండు భారీ వర్షాలు!
Follow us on

Rain Alert In Telangana: రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణితో పాటు తూర్పు బీహార్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కాగా, ఈ రోజు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, మేడ్చల్, మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యపేట, నారాయణపేట జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Also Read:

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..