మొదటి వ్యాక్సిన్ నేనే వేసుకుంటా.. రోజుకు 10 లక్షల మందికి టీకాలు ఇస్తామన్న మంత్రి ఈటల రాజేందర్

తెలంగాణలో రెండో దశ డ్రై రన్ విజవంతమైందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. టీకా ఎప్పుడు పంపినా వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రోజుకు 10 లక్షల మందికి టీకా...

మొదటి వ్యాక్సిన్ నేనే వేసుకుంటా.. రోజుకు 10 లక్షల మందికి టీకాలు ఇస్తామన్న మంత్రి ఈటల రాజేందర్
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 09, 2021 | 9:40 PM

First Shot of Vaccine : తెలంగాణలో రెండో దశ డ్రై రన్ విజవంతమైందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. టీకా ఎప్పుడు పంపినా వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రోజుకు 10 లక్షల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వెల్లడించారు. మొదటి కరోనా వ్యాక్సిన్ తానే తీసుకుంటానని ఈటల స్పష్టం చేశారు.

నిమ్స్‌లో ఆధునికీకరించిన క్యాన్సర్ విభాగాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు. క్యాన్సర్ విభాగం ఆధునికీకరణకు మేఘా సంస్థ రూ.18 కోట్లు అందించింది. ఈ కార్యక్రమంలో మేఘా సంస్థ ఛైర్మన్ పి.పి.రెడ్డి, డైరెక్టర్ సుధారెడ్డి పాల్గొన్నారు. నిమ్స్‌లో క్యాన్సర్ రోగులకు ఆధునిక వైద్యం అందుబాటులోకి రానుంది.

కరోనా కొత్త స్ట్రెయిన్‌తో భయం లేదని అన్నారు. బర్డ్‌ ఫ్లూ వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టంలేదని స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దవద్దని తెలిపారు. వైద్య ఖర్చులు ఎప్పుడు ఎలా వస్తాయో ఊహించలేమని.. ఈహెచ్‌ఎస్, ఆరోగ్యశ్రీ కింద రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. వైద్య రంగంపై రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తున్నాట్లుగా వెల్లడించారు. రూ.450 కోట్లతో నిమ్స్‌లో అభివృద్ధి చేస్తామిని… నిమ్స్‌లో సకల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. వైద్య రంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి :

WhatsApp’s new rules : మీరు వాట్సాప్‌ వాడుతున్నారా? చాటింగ్‌ చేస్తున్నారా? అయితే బహు పరాక్‌.. త్వరలో కొత్త రూల్స్‌

ఓరుగల్లు టూర్‌లో మాటల తూటాలు.. బీజేపీ రాష్ట్ర ఇంచార్జితో కలిసి టూరేస్తున్న బండి సంజయ్‌